ఉత్తమ సమాజ నిర్మాణం యువతతోనే సాధ్యం-వర్మ, ప్రధాన ఉపాధ్యాయులు

Praja Tejam
0


 నేడు కురుగుంట గ్రామంలోహట్టహాసంగా ప్రారంభమైన ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్.                          

     ఈరోజు అనంతపురం రూరల్ పరిధిలోని కురుగుంట గ్రామం నందు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ - 2 మరియు ఎస్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో "నేషనల్ సర్వీస్ స్కీం స్పెషల్ క్యాంప్" ను ఘనంగా ప్రారంభించడం జరిగింది .                      

      ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కురుగుంట ఎంపి యు.పి హెచ్ఎం వర్మ ,ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎం. విష్ణు ప్రియ, ఎస్సార్ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపకులు సుంకర రమేష్ గార్లు పాల్గొని  మెదటగా స్వామి వివేకనంద చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి జ్యోతి ప్రజునుల చేయడం జరిగింది.             ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ "సమాజ నిర్మాణంలో యువత పాత్ర చాలా కీలకమైనదని ప్రపంచ దేశాల్లో అత్యధిక యువత శాతం గల దేశం భారతదేశం అని  కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు  నేషనల్ సర్వీస్ స్కీం ద్వారా విద్యార్థుల్లో సేవా భావాన్ని పెంపొందించడానికి కృషి చేస్తున్నారని, విద్యార్థి దశలోనే నాయకత్వం లక్షణాలు  మరియు సేవాభావాన్ని కలిగి ఉండాలని ఇలాంటి ప్రత్యేక శిబిరాల ద్వారా మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సమస్యలపై మరియు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వారికి తెలియజేయడం వాటివల్ల చేకూర్చే లబ్ధిని తెలియపరచడం.గ్రామీణలో అక్షరాస్యత ,ఆర్థిక అక్షరాస్యత,బాల్యవివాహాలు, రక్తదానం ,పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య రుగ్మతల గురించి వారికి తెలియజేసి  వికసిత్ భారత్ నిర్మాణానికి పాటుపడాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ పద్మశ్రీ, వైస్ ప్రిన్సిపల్ సహదేవుడు మరియు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఎస్సార్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి కె మహేంద్ర పాల్గొన్నారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">