ముందస్తు అక్రమ అడ్మిషన్ నిర్వహిస్తున్న కార్పొరేట్ ప్రవేట్ పాఠశాల పై చర్యలు తీసుకోవాలి: ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం
చదువులు పేరుతో వ్యాపారం చేస్తున్నా కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలపై కఠినమైన చర్య తీసుకోవాలి జిల్లా విద్యా అధికారులు:-ఎస్ఎఫ్ఐ
కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలకు తొత్తులుగా మారిన ఉరవకొండ ఎంఈఓ ఈశ్వరప్ప గారిని వెంటనే సస్పెండ్ చేయాలి
ఉరవకొండ:ఏప్రిల్ 08 (ప్రజాతేజం)
ఉరవకొండ పట్టణంలోని కార్పొరేట్, ప్రవేట్ పాఠశాలలో ఉరవకొండ కి వచ్చి ముందస్తు అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు,సమాచారం ఎంఈఓకి తెలియజేసిన ఎంఈఓ ఈశ్వరప్ప నిమ్మకు నీరుతున్నట్లు ఆయన నిధులు నిర్వహిస్తున్నారు ఈ పరిణామలపై విచారణ జరిపి సదరు అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు నందు మాట్లాడుతూ 2025 -2026 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందునే విద్యార్థుల తల్లిదండ్రులను విద్యార్థులకు మాయమాటలు చెప్పి అక్రమంగా అడ్మిషన్లు చేస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలను యాజమాన్యాలపై చర్య తీసుకోవాలి.
ఒకవైపు ప్రభుత్వం ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తానని చెప్తూ,ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇప్పటినుంటే విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్ చేస్తూ తరగతులను నిర్వహిస్తున్నారు.
ఇప్పటి విద్యాసంస్థలో చదివే విద్యార్థులు ఫీజులు వేధింపులు భరించలేక అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న కళాశాలలో ఎటువంటి మౌలిక వసతులు లేకున్నా,ఒకచోట అనుమతి తీసుకుని ఇంకొక చోట కళాశాల మరియు స్కూల్ నిర్వహిస్తూ, ఇరుకిరుకు తరగతి గదులు,అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యను బోధిస్తూ,కనీసం త్రాగడానికి నీటి సదుపాయం,ఆరోగ్యకరమైన ఆహారం విద్యార్థులకు ఇవ్వలేకపోయినా ఫీజుల పేరుతో విద్యార్థుల విద్యార్థుల తల్లిదండ్రుల ప్రాణాలు బలికొంటున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
విద్యార్థులు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదన్నారు. ఫుడ్ కమిషన్ విద్యాసంస్థల్లో ఎటువంటి ఫుడ్ పెడుతున్నారో పరిశీలించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా విద్యాశాఖ అధికారులు,జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా చొరవ తీసుకొని గుర్తింపు లేని పాఠశాలను సీజ్ చేయాలని అన్నారు, అక్రమ అడ్మిషన్ చేస్తూ లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తరుణ్, మండల నాయకులు భాస్కర్, ఎర్రి స్వామి, ప్రసాద్, కుమార్, కిరణ్, తదితర విద్యార్థులు పాల్గొనడం జరిగింది.