జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు జిజిహెచ్  ద్వారా అందించాలి.

Praja Tejam
0



 వైద్యులందరూ నిర్ణీత సమయంలో తమ విధులకు హాజరుకావాలి.

 *జి జి హెచ్  లో రోగులకుపెట్టే  భోజన నాణ్యతను  స్వయంగా తిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ *

:జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్.

అనంతపురం, ఏప్రిల్ 02  (ప్రజాతేజ మ్) :

*జిల్లా  ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు అనంతపురం GMC మరియు GGH వైద్యులందరూ నిర్ణీత సమయంలో తమ విధులకు హాజరుకావాలని మరియు పనివేళల్లో అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక అనంతపురం  ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్  అన్ని విభాగాల అధిపతులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వైద్యులందరూ తమవృత్తి ధర్మాన్ని విస్మరించరాదన్నారు.అంతేకాక GMC మరియు GGH వైద్యులందరూ నిర్ణీత సమయంలో తమ విధులకు హాజరుకావాలని మరియు పనివేళల్లో అందుబాటులో ఉండి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని అన్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ అకడమిక్ యాక్టివిటీకి పూర్తి బాధ్యత వహిస్తారన్నారు.రోగి సంరక్షణకు సంబంధించి మొత్తం బాధ్యతలను సూపరింటెండెంట్ నిర్వహిస్తారన్నారు. HODలందరూ తమ సహకారాన్ని అడ్మినిస్ట్రేటర్‌కు అందించే విధంగా సమన్వయంతో పనిచేయాలని  అందరూ కలిసి ఒక టీం వర్క్ గా  ప్రజల కోసం కోసంపనిచేయాలన్నారు. GMC, GGH మరియు SSH యొక్క అన్ని HODలు తమ తమ విభాగాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచేందుకు కృషి చేయాలన్నారు.GMC ,ప్రిన్సిపల్ మం జూరైన అన్ని PG సీట్లు మరియు సీనియర్ రెసిడెన్స్ పోస్టులను భర్తీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

HODలందరూ తమ డిపార్ట్‌మెంట్ అభివృద్ధి కోసం వారికి కావాల్సిన  పరికరాలు, సిబ్బంది తదితర వివరాలను త్వరితగతిన అడ్మినిస్ట్రేటర్ అధికారికి అందజేయాలన్నారు.  జిజిహెచ్ నందు  ప్రతి విభాగంలో సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఉండే విధంగా  చర్యలు తీసుకోవాలని, వాటికి సంబంధించిన నివేదికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. వైద్య శాఖలో ఉన్నటువంటి ప్రతి విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి వాటిని భర్తీ చేయుటకు కావలసిన నివేదికలను  తయారు చేయాలన్నారు.ప్రజలకు సేవలు అందించడంలోఎంతో ముఖ్యమైన స్థానం జిజిహెచ్ కు  ఉన్నదని , గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఉమ్మడి అనంతపురం జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంకా చొరవ తీసుకొని పనిచేయాల్సి ఉంటుందన్నారు.వైద్య శాఖలోని వివిధ విభాగాలలోని శాఖధిపతులతో సమన్వయం చేసుకొని జిజిహెచ్ అభివృద్ధికి కృషి చేసిఅనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు.అభివృద్ధిలో భాగంగా వివిధ రకాల సమస్యలు, అడ్డంకులుఎదురైనా వాటిని అధిగమించి  ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.అధికారులు తాముపనిచేస్తున్న సమయంలో  ఆసుపత్రుల్లోఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఎలాంటి  పరికరాలు తేవాలి అని ఒక నిర్ణయానికి వచ్చి వివిధ మార్పులను చేపట్టాలని తద్వారా ప్రజలకు వివిధ రకాల సేవలు అందుబాటులు తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలని, మంచి నాయకత్వ లక్షణాలతో అందర్నీ సమన్వయంచేసుకొని లక్ష్యాలు చేరుకునే దిశగా అడుగులు వేయాలన్నారు.వివిధ విభాగాలలో ఉన్నటువంటి హెచ్ఓడి  లను గౌరవించి వారి సలహాలు,సూచనలు తెలుసుకుని వాటిని కార్యాచరణలో  పెట్టే విధంగా చూడాలని మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్, జి జి హెచ్ సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు తెలిపారు.

సమావేశానికి ముందుగా జిల్లా కలెక్టర్ జిజిహెచ్ లో రోగులకు పెడుతున్న ఆహారాన్ని స్వయంగా తిని పరిశీలించారు.అలాగే జననీ శిశు  సురక్ష  కార్యక్రమం ద్వారా అందిస్తున్న భోజనాన్ని  పరిశీలించి, భోజనం తయారీ కాంట్రాక్టర్  వీరికి అందిస్తున్న భోజనం కు సంబంధించిన బియ్యం, కూరగాయలు ఎక్కడినుంచి తెస్తున్నారని, రోగులు భోజనం చేసిన తర్వాత వారిఅభిప్రాయాలను తెలుసుకుంటున్నారా, ప్రతిరోజు భోజన నాణ్యతను పరిశీలిస్తున్నారా, తదితర వివరాలను డైటీషియన్ రాజేశ్వరిని అడిగి తెలుసుకున్నారు.బియ్యం కాంట్రాక్టర్ స్వయంగా పండిస్తున్నారని, కూరగాయలు మార్కెట్ నుండి తీసుకొని వస్తున్నారని,ప్రతి వార్డు నందు డైట్ ఒపీనియన్ చార్ట్ ను  నిర్వహిస్తున్నామని తెలిపారు. కాంట్రాక్టర్ ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారని  అడిగారు. జూన్ తో రెండు సంవత్సరాలు పూర్తి అవుతుందని వారి కాంట్రాక్ట్ ముగుస్తుందని  అధికారులు తెలిపారు.మద్దికేర మండలం కు చెందిన రామాంజనేయులును భోజనంచేశారా.. ఏ విధంగా ఉంది, మీకు వంట చేయడం వచ్చా, మీ ఇంట్లో వండిన భోజనం బాగుందా లేక ఇక్కడ పెట్టుకు

న్నా భోజనం బాగుందా  అని అడిగారు.  ఇక్కడే   భోజనం బాగుందని చెప్పారు.ఎన్ని రోజుల నుండి ఉన్నారని అడగగా  నాలుగు రోజులుగా ఉన్నావని  ఏ వంట నచ్చిందని  అడిగారు. అటువంటిదేమీ లేదని అన్ని బాగున్నాయని  తెలిపారు. మీరు ఉన్న వార్డులో వెళదాం అని ఎం ఎం వార్డ్ లోని వారి కుమారుడైన  వెంకటేష్ ను  కలిసి ఎలా ఉందని మందులు ఇక్కడ ఇచ్చారా బయట తెచ్చుకున్నారా అని అడిగారు. ఆసుపత్రిలోనే ఇచ్చారని  బాగా చూస్తున్నారని సమాధానం ఇచ్చారు.  ఎం ఎం వార్డులోని మౌలిక సదుపాయాలను, మరుగుదొడ్లను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో  జిజిహెచ్ సూపరిండెంట్ వెంకటేశ్వరరావు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్  మాణిక్యాలరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మల్లికార్జున రెడ్డి,  ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్  అన్ని విభాగాల అధిపతులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">