డిఈఐసి కేంద్రంలో ఘనంగా ప్రపంచ ఆటిజం అవగాహన కార్యక్రమం నిర్వహణ

Praja Tejam
0


 ఆనంతపురం, ఏప్రిల్ 02 (ప్రజాతేజ మ్) : జిల్లా ప్రభుత్వాసుపత్రి -OP No. 99లో ఈరోజు ప్రపంచ ఆటిజం అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి  డా.ఈ.బీ.దేవి హాజరై, ఆటిజం గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమాన్ని ఆర్బిఎస్కే డిఈఐసి & ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ డా. జి. నారాయణస్వామి పర్యవేక్షణలో నిర్వహించారు. అలాగే క్షేత్రస్థాయి జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం మనోవైద్య నిపుణులు డా. విశ్వనాథ్ రెడ్డి మరియు మానసిక వైద్య విభాగం నుండి వచ్చిన డా. రవి నాయక్ ఆటిజం వ్యాధి లక్షణాలు, పిల్లల్లో కనిపించే సమస్యలు, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సా విధానాలు గురించి విశదంగా వివరించారు.

క్లినికల్ & చైల్డ్ సైకాలజిస్ట్ సుందరరావు సిరిగిరి  ఆటిజం ఉన్న పిల్లల మానసిక, సామాజిక అభివృద్ధి కోసం తల్లిదండ్రులు పాటించాల్సిన మార్గదర్శకాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో డిఈఐసిలో అందించే థెరపీ సేవల గురించి ఆటిజమ్ పిల్లల తల్లిదండ్రులు అందరికీ అర్థమయ్యేలా స్కిట్ రూపంలో ప్రదర్శించి థెరపీ విధానాలను కళ్లకు కట్టినట్టుగా చూపించి, వాటి ప్రాముఖ్యతను వివరించారు. అలాగే, ఆటిజం కలిగిన పిల్లల అభివృద్ధికి తోడ్పడే విధంగా డిఈఐసి బృందం ఉచితంగా కలర్ బుక్స్, స్కెచ్ పెన్సిల్స్, కలర్ క్రేయాన్స్ పంపిణీ చేసింది. ఈ కార్యక్రమానికి ఆలంబన జనార్ధన్, సహృదయ సేవా సమితి బాలకృష్ణ ఉచిత భోజన ఏర్పాట్లు చేశారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ఆటిజం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు మానసిక ధైర్యం కల్పించడంతో పాటు, వారికి అందుబాటులో ఉన్న చికిత్స విధానాలను వివరించడమైనది.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">