సమస్యలను పరిష్కారం చేసే దిశలోనే ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఏర్పాటు చేశాం

Praja Tejam
0



- : ఉరవకొండ నియోజకవర్గంలో అభివృద్ధిని శరవేగంగా ముందుకు తీసుకెళ్తాం..

- : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేస్తాం

- : అర్జీలన్నీ నమోదు చేసుకొని ఒక బాధ్యతతో వాటిని పరిష్కరిస్తాం

- : రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్

- : విడపనకల్లు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్..

ఉరవకొండ , ఏప్రిల్ 08 (ప్రజాతేజమ్):

- ప్రజల సమస్యలను పరిష్కారం చేసే దిశలోనే మండల కేంద్రంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, అర్జీలన్నీ ఒక బాధ్యతతో పరిష్కరిస్తామని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. మంగళవారం ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్లు మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ అర్జీలను స్వీకరించారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో మంత్రి మొక్కను నాటారు. అనంతరం అక్కడే రూఫ్ టాఫ్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. తదనంతరం ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి వారిని మంత్రి పేరుపేరునా పలకరించారు.

- ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘకాలం ఉండడంతో సమావేశాల్లో ఎక్కువ కాలం గడపడం, అనేక సమస్యలపై ఫోన్లు రావడం జరిగిందని, ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఒక కార్యక్రమం రూపొందించాలనుకున్నామన్నారు. 30 ఏళ్లుగా మీలో ఒకడిగా భావించి నన్ను ఈ స్థాయి తీసుకొచ్చిన ఉరవకొండ నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకునే బాధ్యత తనపై ఉందన్నారు. రాష్ట్రంలో తనకున్న బాధ్యతలను ఒకవైపు నిర్వర్తిస్తూనే, నియోజకవర్గ బాధ్యతలను కూడా పూర్తిస్థాయిలో చేయాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. రాష్ట్రానికి మంత్రినైనా జిల్లాకు, ఉరవకొండ నియోజకవర్గంకు మొదటి కూలీగానే పనిచేస్తానన్నారు. తన ఆలోచనలు, దృక్పథంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. మీలో ఒకడిగా మీ కష్టాలను, కన్నీళ్లను, బాధలను చూసి సమస్యలను పరిష్కారం చేసే దిశలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో అప్పులను వారసత్వంగా ఇచ్చారని, ఆస్తులు లేకుండా అప్పులు ఇచ్చిపోతే ఆ కుటుంబాన్ని నెట్టుకు రావడం ఎంత భయంకరంగా ఉంటుందో ఈరోజు రాష్ట్రంలో కూడా ఆర్థిక పరిస్థితి అంతే అస్తవ్యస్తంగా ఉందన్నారు. పూర్తి అప్పులమయం అయిపోయిందని, శుక్రవారం రోజు బ్యాంకుల నుంచి అప్పు కట్టాలని తనకు ఫోన్లు వస్తాయన్నారు. వీటన్నిటిని నడుమ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు అన్నింటినీ సమతూకం చేసుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. మన ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత అనేది మామూలుగా చెప్పాలంటే రాష్ట్ర మొత్తం వచ్చే ఆదాయం, కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చే ఆదాయం మొత్తం తీసుకుంటే మనం ప్రభుత్వాన్ని నడపడానికి, జీతభత్యాలకు, పాత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలు కట్టేందుకు సరిగ్గా సరిపోతుందని, ఒక్క రూపాయి మిగలడం లేదన్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు ఎలా నడపాలి, మధ్యాహ్న భోజనం ఎలా నడపాలి, లాంటివన్నీ ఆపలేని పథకాలని, వీటన్నిటిని నడపాలంటే అప్పుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉందన్నారు. వీటితోపాటు హంద్రీనీవా కాలువ, జిబిసి కాలువ, విడపనకల్లు నుంచి గడేకల్లుకు, వి.కొత్తకోటకు, హావలిగి రోడ్డు, తాగునీటి ఏర్పాట్లు, ప్రజల ఆశలు, ఇబ్బందులు అన్నిటినీ సమతూకం చేసుకుంటూ ముందుకెళ్లడం అంటే కత్తి మీద సాములాంటిదే అన్నారు. మీరు పెట్టిన నమ్మకం వమ్ము కానీయకుండా రోజుకు మరిన్ని గంటలు అదనంగా కష్టపడతామని, తగ్గేది లేకుండా పని చేస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తామని, నియోజకవర్గంలో గతంలో లాగా అభివృద్ధిని ఎలా అయితే పరుగులు పెట్టించామో అలాగే నియోజకవర్గంలో అభివృద్ధిని శరవేగంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. ఉరవకొండలో డిగ్రీ, జూనియర్ కాలేజీలు, హాస్పిటల్ ఏర్పాటు, జిబిసి కెనాల్ కు సిమెంట్ లైనింగ్, తాగునీటి పైప్ లైన్లు తమ హయాంలోనే ఏర్పాటు చేశామని, ఇంతకుముందు మనం చేసిన పనులు ఆగిపోతే మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. జిల్లాకు అదనంగా నీళ్లు వస్తే తప్ప మన జీవితాలు మారవని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో లేనటువంటి విధంగా 3,800 కోట్ల బడ్జెట్ కేటాయింపులు హంద్రీనీవా కాలువకు కేటాయించామని గర్వంగా చెబుతున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశీస్సులతోనే అది చేయగలిగామని, జిల్లాపై ఉన్న ప్రేమ, బాధ్యతతోనే చేశామన్నారు. కేవలం కేటాయింపులు మాత్రమే చేయలేదని, కేటాయింపులు చేసిన మరుసటి రోజు నుంచే పనులు ప్రారంభించామని, గత ప్రభుత్వంలో గంపమన్ను తీయలేదని, కానీ మనం సంవత్సరంలోనే ఎన్ని కష్టాలు వచ్చినా ఇంకా నిలదొక్కుకోకుండా బడ్జెట్ కేటాయింపులు పెట్టి పనులు ప్రారంభించామని, సోమవారం వెళ్లి చూస్తే 10 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. 70 రోజుల్లోనే హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకోవడం జరిగిందని, భగవంతుడు సహకరిస్తే ఈ సీజన్లోనే పనులు పూర్తి చేసి 10, 12 మోటర్లు వేసుకునేలా చేస్తే నీళ్ల ఇబ్బందులు లేకుండా పోతుందన్నారు. రైతుల ఇబ్బందులు తీరాలంటే నీళ్లు ఇస్తే ఎవరి పని వాళ్లు చేసుకుంటారన్నారు. కాలువలను సజావుగా నిర్వర్తించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. తాను ఎక్కడున్నా ఉరవకొండలో అభివృద్ధి పనులు శరీవేగంగా జరుగుతాయని, హంద్రీనీవా కాలువ కింద డబ్బులు రానటువంటి రైతులకు 50 కోట్ల రూపాయలను విడుదల చేశామని, కాలువలు తవ్వెందుకు భూ సేకరణ కోసం మరో 30 కోట్లు ఇస్తున్నామన్నారు. వజ్రకరూరు మండలంలో కాలువల పనులకు డబ్బులు కేటాయింపులు చేసుకున్నామన్నారు. విడపనకల్లు నుంచి గడేకల్లుకు వెళ్లే రోడ్డును మంజూరు చేయించామని, తొందరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. ఈ ఒక్క పని ఆగేదానికి లేదని, నియోజకవర్గం రుణం తీర్చుకునేందుకు పనిచేస్తూనే ఉంటామన్నారు.

- ఉరవకొండలో ప్రతి కులానికి ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలనే ఉద్దేశంతో గతంలో ఊహించని రీతిలో నిధులు కేటాయించామన్నారు. వాల్మీకి కమ్యూనిటీ హాల్ కి 50 లక్షలు రూపాయలు, కురుబ సామాజిక వర్గానికి చెందిన కమ్యూనిటీ హాల్ కి 50 లక్షలు, ఎస్సీల కమ్యూనిటీ హాల్ కి రూ. 50 లక్షలు, మైనార్టీ కమ్యూనిటీ హాల్ కి రూ. 50 లక్షలు, యాదవుల కమ్యూనిటీ హాల్ కి 30 లక్షల రూపాయలు, కృష్ణదేవరాయల బలిజ సామాజిక వర్గానికి చెందిన కమ్యూనిటీ హాల్ కి నిధులు కేటాయించామని, ప్రతి కులానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అభివృద్ధిలోను, సామాజిక అభివృద్ధిలోనూ రెండింటినీ సమతూకంగా ముందుకు తీసుకెళుతున్నామన్నారు. తనకు కష్టమైనా సరే నియోజకవర్గంలో మీ పనులు ఆగకూడదనేది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, ఇందులో ప్రజల అర్జీలను రాసేందుకు సిబ్బందిని ఏర్పాటు చేశామని, ప్రతి అర్జీకి రసీదు ఇస్తారని, కంప్యూటర్లో ఎంట్రీ చేస్తారని, ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారన్నారు. ఇందులో మీరు ఇచ్చే అర్జీని నమోదు చేసుకుని ఆన్లైన్లో నమోదు చేస్తారని, అధికారులు మీ వద్దకు వచ్చి విచారణ చేసి అర్జీలను పరిష్కరిస్తారని, వచ్చిన అర్జీలలో ఎన్ని పరిష్కారం అయ్యాయి ఎన్ని చేయాల్సి ఉంది అనే దానిపై తాను పర్యవేక్షణ చేస్తానన్నారు. విడపనకల్లు మండలంలో ఎన్ని అర్జీలు వచ్చాయి ఎన్ని పరిష్కరించారు అనేది వారానికి ఒకటి రెండు రోజులు పరిశీలన చేస్తామని, భూమికి సంబంధించిన పలు సమస్యలలో ఇబ్బందులు వస్తాయని, వాటిలో చేయగలిగినవి ఖచ్చితంగా పరిష్కరిస్తామని, మిగిలినవి నీళ్లు, రోడ్లు,  డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు, కరెంట్ లైన్స్ కావాలన్నా ఏదో ఒక దశలో వాటన్నిటికీ పరిష్కారం చూపిస్తున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. బుధవారం బెలుగుప్ప మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అనంతరం నియోజకవర్గంలోని ఇతర మండలాల్లో నిర్వహిస్తామన్నారు. అర్జీలన్నీ నమోదు చేసుకొని ఒక బాధ్యతతో పరిష్కారం అయ్యే వాటిని పరిష్కరిస్తామన్నారు. పరిష్కారం కానీ సమస్యలకు ప్రత్యామ్నాయం ఏమి అనేది ఆలోచన చేస్తామన్నారు.

- ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ.మాలోల, జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ ఎస్ఆర్బిఐ శ్రీనివాస్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్, జిల్లా పరిషత్ సిఈఓ రామచంద్రారెడ్డి, డిఎల్డిఓ విజయలక్ష్మి, సర్పంచ్ చంద్రశేఖర్, సిపిఓ అశోక్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ రామసుబ్బారెడ్డి, ఎల్డిఎం నర్సింగరావు, డిటిడబ్ల్యుఓ రామాంజనేయులు, డ్వామా పీడీ సలీమ్ భాష, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ సురేష్, సర్వే ఎడి రూప్లనాయక్, ఆర్టీసీ ఆర్ఎం సుమంత్, సోషల్ వెల్ఫేర్ జెడి రాధిక, డిఆర్డిఏ పిడి ఈశ్వరయ్య, సమగ్ర శిక్ష ఏపిసి శైలజ, సివిల్ సప్లై డిఎం రమేష్ రెడ్డి, డిపిఓ నాగరాజునాయుడు, బిసి వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, ఎపిఎంఐపి పిడి రఘునాథరెడ్డి, మార్కెటింగ్ ఎడి సత్యనారాయణ చౌదరి, బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యం, పశుసంవర్ధక శాఖ జెడి వెంకటస్వామి, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ విశ్వనాథ్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాస యాదవ్, పిజిఆర్ఎస్ తహసిల్దార్ వాణిశ్రీ, డ్రగ్స్ ఏడి రమేష్ రెడ్డి, ఎంపిడిఓ షకీలాబేగం, ఇంచార్జి తహసీల్దార్ చంద్రశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గ, మండల అధికారులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">