రేపట్నుంచి ఆధార్‌ ప్రత్యేక క్యాంపులు

Praja Tejam
0


 అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్‌ ప్రత్యేక క్యాంపులు ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు మరలా 8 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ పేర్కొంది. పెండింగ్‌లో ఉన్న 0-6 సంవత్సరాల వయసు గల చిన్నారులందరూ ఈ సదావకాశాన్ని వారి తల్లిదండ్రులు వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ శాఖ డైరెక్టర్‌ శివప్రసాద్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 0-6 సంవత్సరాల వయసు గల చిన్నారుల్లో 1,95,735 మందికి జనన ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఉండగా, వీరందరూ ఇప్పటి వరకు ఆధార్‌ నమోదు చేయించుకోలేదు. ఆధార్‌ నమోదు చేయించుకోని చిన్నారుల్లో అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 12,218 మంది, అత్యల్పంగా అన్నమయ్య జిల్లాలో 4,001 మంది చిన్నారులున్నారు. ఆధార్‌ క్యాంపులను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేయాలని శివప్రసాద్‌ పిలుపునిచ్చారు

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">