ఎపిలో మొదటి కేసు – బర్డ్‌ఫ్లూ (హెచ్‌5ఎన్‌1) తో చిన్నారి మృతి

Praja Tejam
0

 


  • పచ్చి కోడి మాంసం తినటం వలనే సోకిన వైరస్‌..
  • చికెన్‌ తినే వాళ్ళు తప్పనిసరిగా 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తినాలి…

ప్రజాతేజమ్   పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా నరసరావుపేటలో బర్డ్‌ఫ్లూ (హెచ్‌5ఎన్‌1) తో రెండేళ్ల చిన్నారి మరణిం
చింది. ఏపీ లో ఇదే మొదటి కేసు. పచ్చి కోడి మాంసం తినే అలవాటుతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం చిన్నారి మరణానికి దారితీసిందని వైద్యులు గుర్తించారు. బర్డ్‌ఫ్లూ కారణంగానే చిన్నారి మరణించినట్లు భారత వైద్య పరిశోధన మండలి కూడా నిర్ధారించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. మార్చి 16న బాలిక చనిపోగా, వివిధ స్థాయిల్లో నమూనాలను పరీక్షించి అధికారికంగా ధ్రువీకరించారు. బర్డ్‌ఫ్లూ కారణంగా మనుషుల మరణం సంభవించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది.

పరీక్షలు…
నరసరావుపేటకు చెందిన చిన్నారిని జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు కారడం, మూర్ఛ, విరేచనాలు, ఆహారం తినలేని పరిస్థితిలో మార్చి 4న మంగళగిరిలోని ఎయిమ్స్‌కు తీసుకొచ్చారు. అక్కడి వైద్యులు బాలికకు ఆక్సిజన్‌ సాయంతో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. మార్చి 16న మఅతి చెందింది. అయితే, చికిత్స అందించే సమయంలో మార్చి 7న పాప గొంతు, ముక్కు నుంచి తీసిన స్వాబ్‌ నమూనాలను ఎయిమ్స్‌లోని వీఆర్‌డీఎల్‌లో పరీక్షించారు. ఇన్‌ఫ్లుయెంజా ఎ పాజిటివ్‌గా తేలింది. అనంతరం మరో నమూనాను 15న ఢిల్లీలో పరీక్షించారు. అక్కడ నివేదిక అనుమానాస్పదంగా రావడంతో అప్రమత్తమైన ఐసీఎంఆర్‌.. 24న స్వాబ్‌ నమూనాలను పుణెలోని ఎన్‌ఐవీ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ)కి పంపించింది. అక్కడ హెచ్‌5ఎన్‌1 వైరస్‌గా నిర్ధారించారు.

కుటుంబ సభ్యుల విచారణ…
వైద్యారోగ్య శాఖ అధికారులు తాజాగా చిన్నారి కుటుంబ సభ్యులను విచారించారు. పెంపుడు, వీధి కుక్కలతో బాలిక తరచూ ఆడుకునేదని వారు చెప్పారు. చిన్నారిలో ఫిబ్రవరి 28న జ్వర లక్షణాలు కన్పించగా, అంతకు రెండురోజుల ముందు పచ్చి కోడి మాంసం తిన్నట్లు తెలిపారు. పల్నాడు జిల్లాలో ఎక్కడా బర్డ్‌ఫ్లూ వైరస్‌ వ్యాప్తి లేదని పశు సంవర్ధక శాఖ అధికారులు వివరించారు. బాధిత కుటుంబం నివసించే ఇంటికి కిలోమీటరు దూరంలో ఒకరు మాంసం దుకాణం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. చిన్నారి ఇంటి సమీపంలో వైద్య ఆరోగ్యశాఖ జ్వర సర్వే చేసి, అనుమానిత లక్షణాలున్న వారెవరూ లేరని తేల్చింది. స్థానికంగా ఈ తరహా కేసులేవీ నమోదు కాలేదని ప్రభుత్వానికి నివేదించింది. వైద్యారోగ్య శాఖ నుంచి ప్రత్యేక అధికారి శ్యామల మంగళవారం నరసరావుపేటకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను, స్థానికులను విచారించారు.

చికెన్‌ పచ్చి మాంసం ముక్క తిన్నందుకే..
‘కోడి కూర కోసే సమయంలో పాప అడిగితే ఒక ముక్క ఇవ్వగా, తిన్నదని, తర్వాతే జబ్బు పడిందని పాప కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలోనూ ఓసారి ఇలాగే ఇచ్చామన్నారు. ఉడికించిన మాంసం తిన్నవారిలో ఎవ్వరికీ ఆరోగ్య సమస్యలు రాలేదని చిన్నారి తల్లి తెలిపారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">