జూన్ 10వ తేదీకి హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు పూర్తి చేయడమే లక్ష్యం

Praja Tejam
0






- : చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హంద్రీనీవా ప్రధాన కాలువ వెడల్పు పనులకు 3,800 కోట్ల రూపాయల కేటాయింపులు చేశాం..


- : ఒక పోలవరం మినహా తెలంగాణ, దక్షిణాది భారతదేశంలో ఏ ఒక్క సింగల్ ప్రాజెక్టుకు ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు జరగలేదు.

- : జిల్లాలో 82 కిలోమీటర్ల మేర ఉన్న హంద్రీనీవా కాలువలో ఇప్పటికే 12 కిలోమీటర్ల కాలువ వెడల్పు పనులు పూర్తిస్థాయిలో చేపట్టాం..

- : రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన గడువులోపు  పనులు పూర్తి చేయాలంటే ఇది ఒక ఇంజనీరింగ్ ఛాలెంజ్..

- : 20 ఏళ్లలో జరిగిన పనిని 70 రోజుల్లో పూర్తిచేసేలా ప్రణాళిక..

- : హంద్రీనీవా పనులు పర్యవేక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతున్నాం..

- : రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్

- : ఉరవకొండ వద్ద నుంచి రాగులపాడు వరకు హంద్రీనీవా ప్రధాన కాలువ వెడల్పు పనులను పరిశీలించిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్..

అనంతపురం / ఉరవకొండ , ఏప్రిల్ 07  (ప్రజాతేజమ్):

- హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 10వ తేదీకి డెడ్ లైన్ విధించారని, అప్పటిలోపు హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు పూర్తి చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.

- సోమవారం ఉరవకొండ - అనంతపురం మెయిన్ రోడ్డులో ఉరవకొండ పట్టణం వద్దనున్న హంద్రీనీవా కాలువ నుండి రాగులపాడు రోడ్డు వరకు 35వ ప్యాకేజీ కింద హంద్రీనీవా ప్రధాన కాలువ వెడల్పు పనులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పరిశీలించారు. ఉరవకొండ వద్ద నుంచి రాగులపాడు వరకు హంద్రీనీవా ప్రధాన కాలువపై అధికారులతో కలిసి మంత్రి పర్యటించి పనులను సమగ్రంగా పరిశీలన చేశారు.

- ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో 2014-19 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హంద్రీనీవా కాలువ వెడల్పు పనులకు శ్రీకారం చుట్టారన్నారు. ఆరోజున శరవేగంగా 40 శాతం పనులను పూర్తిచేస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం కనీసం ఒక గంప మన్ను కూడా కాలువ మీద తీసేయలేదన్నారు. తాము మళ్లీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి అనంతపురం జిల్లాపై ఉన్న ప్రత్యేక ప్రేమ, అభిమానంతో బడ్జెట్ కేటాయింపులపై చర్చ జరుగుతున్నప్పుడు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి సీఎం మాకు ప్రోత్సాహం ఇచ్చారన్నారు. ఒక ప్రాజెక్టు మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దాదాపు 3,800 కోట్ల రూపాయల కేటాయింపులు ఎప్పుడూ జరపలేదన్నారు. ఒక పోలవరం మినహా రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు ఒక బడ్జెట్లో జరిపినటువంటిది ఎక్కడా కూడా లేదన్నారు. తెలంగాణ, దక్షిణాది భారతదేశంలో ఏ ఒక్క సింగల్ ప్రాజెక్టుకు ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు జరగలేదన్నారు. కేవలం కేటాయింపులు జరిపి ప్రచారం చేసుకునే ఆలోచన తమకు లేదని, పనులను కూడా వెంటనే ప్రారంభించామన్నారు. ఈ ఏడాది మార్చి 15 - 20వతేదీ మధ్య బడ్జెట్ అప్రూవల్ పూర్తి చేసుకుంటే, అప్పటికే సన్నద్ధత పనులు పూర్తి చేసుకుని 20 రోజుల్లోనే పనులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. పెద్ద ఎత్తున పనులు ప్రారంభమయ్యాయని, అనంతపురం జిల్లాలో 82 కిలోమీటర్ల మేర ఉన్న హంద్రీనీవా కాలువలో 12 కిలోమీటర్ల కాలువ వెడల్పు పనులు ఇప్పటికే పూర్తిస్థాయిలో చేసేయడం జరిగిందన్నారు. 10 నుంచి 15 శాతం పని ఇప్పటికే పూర్తయిందన్నారు. హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జూన్ 10వ తేదీకి డెడ్ లైన్ విధించారన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ సిఈ, ఎస్ఈ, కాంట్రాక్టర్లు అందరూ కూడా ఇదే లక్ష్యంతో పని చేస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన గడువులోపు పనులు పూర్తి చేయాలంటే ఇది ఒక ఇంజనీరింగ్ ఛాలెంజ్ అన్నారు. 20 ఏళ్లుపాటు కాలువలో ఎంత మట్టి ఎత్తివేశామో.. దాంట్లో 60 - 70 శాతం మట్టిని ఇప్పుడు తీయాల్సి వస్తుందన్నారు. 7 మీటర్ల కాలువని పెంచుతున్నామని, 12 మీటర్ల నుంచి 19 మీటర్ల వెడల్పు వరకు చేసుకుంటున్నామని, 20 సంవత్సరాలలో జరిగిన పనిని 70 రోజుల్లో పూర్తిచేసేలా ప్రణాళిక వేయడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలోకి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని, సాయిల్ బిహేవియర్, సెట్టింగ్ చాలా వేగంగా చేస్తామనుకుంటే వర్షాలు ఉండడం, కెనాల్ లో నీరు ఆగిపోయిన వెంటనే డ్రై కాకపోవడంతో స్లెట్ డ్రై కాక స్లస్సి మెటీరియల్ వస్తోందని, తీయడానికి మిషన్లు ఇరుక్కుపోతున్నాయని, టిప్పర్లు సగం మాత్రమే లోడ్ చేసుకుని ఎక్కువసార్లు తిరగాల్సి వస్తోందని, ఇలా అనేక ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఎక్కడా వెనక్కి తగ్గడం లేదని, ఈరోజుకు 195 పెద్ద ఎస్కవేటర్లు పనిచేస్తున్నాయని, దానికి రెట్టింపు స్థాయిలో టిప్పర్లు, రోజర్లు, కాంప్యాక్టర్స్ పనిచేస్తున్నాయన్నారు. నిశ్శబ్దంగా హంద్రీనీవా కాలువ వెడల్పు చేసే పనులు పూర్తిస్థాయిలో అమలు చేయడం జరుగుతోందన్నారు. 80 శాతం మిషనరీ, మెన్ పవర్ పనిచేస్తున్నాయని, కాలువపై ఉన్న జంగిల్ క్లియరెన్స్ చేసుకోవడానికి చాలా సమయం పట్టిందని, గత ప్రభుత్వంలో రైతులు పొలాలకు వెళ్లే దారిలో కూడా కంపచెట్లు తొలగించలేదన్నారు. కెనాల్ జంగిల్ పేరెంట్స్ చేసుకుని ఫ్రెష్ గా లెవెల్స్ అన్నీ తీసుకుని, ఆ లెవెల్స్ ప్రకారం మళ్లీ డిజైన్ చేసుకుని సిల్ట్ స్థాయిలో సిల్ట్ అంతా తొలగించి బాటమ్ స్థాయిని మెయింటైన్ చేసేలా చూస్తున్నామన్నారు. మండుటెండలను లెక్కచేయకుండా పనిచేస్తున్న హెచ్ఎన్ఎస్ఎస్ సిఈ, ఎస్ఈ, ఈఈ, వారి టీంని అభినందిస్తున్నామన్నారు. ఈ పనులకు సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేశామని, అందులో ఏ కిలోమీటర్ లో ఏ మిషన్ ఎంత పని చేస్తున్నాయి, సాయంత్రానికి ఎంత పని జరిగిందనేది అప్డేట్ వస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏమాత్రం అలసత్వం ఉన్నా అది సాధ్యం కాదని, అందుకు సిద్ధం చేయడం కోసం మొదట్లో ఒక 10, 15 రోజులు అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు. ఇప్పుడు యంత్రాంగం సిద్ధంగా ఉందని, ఇంకో పది, ఇరవై శాతం సిద్ధమైతే పనులన్నీ పూర్తిస్థాయిలో జరుగుతాయన్నారు. జూన్ 10వ తేదీకి రెండు నెలల సమయం ఉందని, 60 రోజుల్లో 80 శాతం పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఇది చాలెంజింగ్ టాస్క్ అని, గొప్ప పనిని చేస్తున్నామనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నామన్నారు. ఉరవకొండ నియోజకవర్గం నుంచి పలుమార్లు గెలిపించిన ప్రజలకు ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు. జిల్లా ప్రజల రుణం తీర్చుకునేందుకు పెద్ద ఎత్తున కేటాయింపులు జరపడం, దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో సహకారం అందించి పనులు కూడా పూర్తి చేయాలని ప్రోత్సహించడం, జిల్లా తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇది చరిత్రలో ఎన్నడూ జరిగినటువంటి విషయమని, ఇంత పెద్ద ఎత్తున పనులు జరుగుతుంటే ప్రతిపక్షం నాయకులు ఎక్కడా కాలువ మీద రాలేదని, నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వలేదన్నారు. మొదటి దశలో కూడేరులో కొద్ది పోర్షన్ మినహా అనంతపురం జిల్లాలో ఎక్కడ కాలువ లైనింగ్ చేయడం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్న కాలువ వెడల్పు పనులకు కూడా లైనింగ్ చేయమని టెండర్ పిలిచారని, ఆ రోజు ఒక్కరూ నోరు మెదపలేదు, పదవి పోతుందని భయపడ్డారన్నారు. ప్రజలకు ఏది మంచిదైతే అది చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాలువ వెడల్పుతో పాటు భగవంతుడు సహకరిస్తే ఇంకా వెడల్పు చేయవచ్చని, 3,800 క్యూసెక్కుల నీరు కాలువలో ఎలా తీసుకెళ్లాలో మొదటి దశలో తాము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గత ముఖ్యమంత్రి గతంలో ఉరవకొండకి వచ్చి జలదీక్ష చేసి మూడు నెలల్లో హంద్రీ పనులు ప్రారంభిస్తాం అన్నారని, ప్రభుత్వం వచ్చాక ఐదేళ్లు మర్చిపోయారన్నారు. ఇవాళ మేము ఒక్క మాట కూడా రైతులకు చెప్పలేదని, మా మీద నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు ముఖ్యమంత్రి టీం చంద్రబాబు రేయింబగళ్లు పనిచేస్తోందన్నారు. తాము ప్రచార ఆర్భాటాలకు పోవడం లేదని, చంద్రబాబు ప్రభుత్వం కళ్ళ ముందు చూపిస్తోందని, బడ్జెట్ కేటాయింపులు జరిగాయని, కేటాయింపులు జరిగిన మరుసటి రోజు నుంచే పనుల ప్రారంభమయ్యాయని, నిశ్శబ్దంగా పనులు కూడా 10 శాతం పూర్తయ్యాయన్నారు. అనంతపురం జిల్లాకి రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నామని, సీఎం ఆలోచనలు, గైడ్లైన్స్ కూడా మాకు కావాలని, ఇంకా పనులు ఎలా మెరుగ్గా చేయొచ్చు అనేది కావాలని, హంద్రీనీవా పనులు పర్యవేక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతున్నామని, సమయం చూసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వస్తారని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలని పనులు ఎక్కడా ఆపలేదని, ఆయనే పనులు ప్రారంభించాలని, ఆగరాదని చెప్పారని, అమరావతిలో కూర్చుని పనులను ముఖ్యమంత్రి సమీక్ష చేస్తున్నారని, గత ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి అదే తేడా అన్నారు. తమ ప్రభుత్వం స్పష్టంగా ప్రజల కోసం పని చేస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రికి అనంతపురం జిల్లా పట్ల ప్రత్యేక శ్రద్ధ, ప్రేమ ఉందనడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం అక్కర్లేదన్నారు. హంద్రీనీవాకు సీఎం చేసిన కేటాయింపులు, ఇవాళ పనులు జరుగుతున్న తీరు కావచ్చు, ఇదే నిదర్శనం అన్నారు. భైరవాణి తిప్ప ప్రాజెక్ట్, అప్పర్ పేరూరు ప్రాజెక్ట్, లాంటి వాటికి నీరు రావాలని, వేడల్పు చేసుకుంటూ వెళ్తేనే నీరు వస్తాయన్నారు.

- ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి వజ్రకరూరు మండలంలో భూ సేకరణకు కనీసం ఒక్క రూపాయి నిధులు విడుదల చేయలేదని, తాము రైతులతో నమ్మకంగా కాలువలు తవ్వించామని, లత్తవరం ఫీడర్ కెనాల్ చేశామని, మొన్న దాదాపు 40 - 42 కోట్ల రూపాయలు విడుదల చేశామని, ఇంకా 30 - 40 కోట్లకు సంబంధించి రైతులు డాక్యుమెంట్లు ఇవ్వలేదని, ఇస్తే వాటిని కూడా మంజూరు చేస్తామన్నారు. ఎక్కడ పెండింగ్ పెట్టకుండా పనులన్నింటినీ కూడా ప్రణాళికాబద్ధంగా అమలు చేసుకుంటూ రాత్రి పగలు దానిమీద పని చేస్తున్నామన్నారు. ఆముదాల లిఫ్ట్ ఇరిగేషన్ కింద కెనాల్ కు సంబంధించిన డబ్బులు కూడా మేము రిలీజ్ చేశామన్నారు. కొట్టాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. మోపిడి, లత్తవరం, సెక్షన్ పల్లి, కోనాపురం చెరువులకు నీరు ఇవ్వడం, లాంటి ఎక్కడ అవకాశం ఉన్న అన్ని పనులను పూర్తి చేస్తామన్నారు. ఎక్కడ పిల్ల కాలువల వైపు పోలేదని, దృష్టి మొత్తం ప్రధాన కాలువపై పెట్టడం జరిగిందని, మైక్రో లెవెల్ ప్రణాళికతో పని చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 12 మోటర్లు ఆన్ చేయాలని లక్ష్యం పెట్టడం జరిగిందని, 9, 10 మోటర్లు ఆన్ చేయగలిగితే గ్రేట్ అచీవ్మెంట్ అని తాము భావిస్తున్నామని, 50 శాతం నీరు అదనంగా తెచ్చిన వారం అవుతామన్నారు. రాష్ట్ర ఇరిగేషన్ చరిత్రలో పట్టిసీమ తర్వాత హంద్రీనీవా కాలువ వెడల్పే గొప్ప ఘనత అవుతుందన్నారు. లక్ష్యంలోపు పనులు పూర్తిచేస్తే 70 రోజుల్లోనే హంద్రీనీవా కాలువ వెడల్పు చేసే ఘనత ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. మాల్యాల నుంచి జీడిపల్లి వరకు కాలువ వెడల్పు పనులు జరుగుతున్నాయని, పనులు పూర్తి అయితే 3,800 క్యూసెక్యుల నీరు తీసుకురావడం లక్ష్యం అన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పరిస్థితులను అధిగమించి ఖచ్చితంగా జిల్లా ప్రజల రుణాన్ని తీర్చుకుంటామని తెలిపారు. అనంతపురం జిల్లాలో జరగని లైనింగ్ పై అనంతపురం నేతలు ఆందోళన చేయడం విడ్డురంగా ఉందని, సత్యసాయి జిల్లాలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అక్కడ కొందరు లైనింగ్ కావాలని అడుగుతున్నారని, అక్కడ అన్ని చెరువులకు నీరు అందిస్తామన్నారు.
 
- ఈ కార్యక్రమంలో హెచ్ఎన్ఎస్ఎస్ సిఈ నాగరాజు, ఎస్ఈ రాజ స్వరూప్ కుమార్, ఈఈ శ్రీనివాస్ నాయక్, డిఈ పివి.రమణ, జెఈ భాస్కర్, రాఘవేంద్ర, గౌస్ భాష, తహసీల్దార్ మహబూబ్ భాష, ఎంపిడిఓ, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">