భావిభారత
పౌరులైన విద్యార్థులు కళాశాలలు పెట్టే ఒత్తిళ్లకు బలవుతున్నారు. వారానికి
ఏడు రోజుల పాటు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు చదువుల పేర
విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థలలో బంధీలవుతున్నారు. ఈ ఒత్తిడిని
తట్టుకోలేక అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఫీజులు కడుతున్న తల్లిదండ్రులు
ర్యాంకుల మాయలో పడి, దాని వలన జరిగే నష్టాన్ని గ్రహించలేకపోతున్నారు.
నిబంధనలు ఇలా చెప్తున్నాయి
రాష్ట్రంలో దాదాపుగా 13,249 ప్రైవేట్ స్కూళ్లు, 3568 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో అధిక భాగం కార్పొరేట్ విద్యా సంస్థలే. ఇక్కడ లక్షలాది మంది చదువుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైమరీ పాఠశాలల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, యు.పి, ఉన్నత పాఠశాలల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలి. వీటిలో కూడా వారానికి మూడు రోజులు గంటపాటు ఆటలు ఆడించాలి. ఇక కళాశాలల విషయానికొస్తే ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నిర్వహించాలి. మన రాష్ట్రంలో 90 శాతం విద్యా సంస్థలు నిబంధనలు పాటించిన పాపాన పోలేదు. ఎన్.సి.ఆర్.బి నివేదిక ప్రకారం ఈ ఒత్తిడి తట్టుకోలేక 2014 నుంచి 2022 వరకు 3690 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక్క 2022 సంవత్సరంలోనే 575 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. దీన్నిబట్టే విద్యార్థులు ఎంత ఒత్తిడికి లోనవుతున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వం ఏం చేస్తున్నది?
ఈ వారంలోనే ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. అదేమిటంటే ఒత్తిడి తగ్గించడం కోసం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేస్తున్నామని తెలిపింది. పరీక్షల రద్దు వలన ఒత్తిడి తగ్గుతుందనుకోవడం హాస్యాస్పదం. అసలు కార్పొరేట్ విద్యా సంస్థల అధిపతి అయిన మంత్రి పి.నారాయణను విద్యా కమిటీలో పెట్టడం ద్వారా ప్రభుత్వం ఏం సందేశం ఇవ్వాలనుకుంటుందో అర్థం కావడం లేదు. ఈ మధ్యనే పాఠశాలలో వంద రోజుల కార్యక్రమం పెట్టింది. వంద రోజులు పాటు విశ్రాంతి లేకుండా చదువుల పేరుతో విద్యార్థులను వేధిస్తే వారు ఏమైపోతారోననే ఆలోచన కూడా లేకుండా పోయింది.
తల్లిదండ్రులారా ఆలోచించండి…
తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కార్పొరేట్ విద్యాసంస్థల్లో చేరుస్తున్న తల్లిదండ్రులు ఒక విషయం ఆలోచించాలి. విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కాదు కదా అసలు వారికి భవిష్యత్తు లేకుండా పోతుంది ఈ విధానాల వల్ల. అనేక మంది విద్యార్థులు ర్యాంకుల వేటలో సాగలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకొంతమంది విద్యార్థులు ఒత్తిడిని లోలోపల దాచుకుంటూ ఆరోగ్య సమస్యలను కొనితెచ్చు కుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నిబంధనలకు అనుగుణంగా తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. ఇదే సందర్భంలో తల్లిదండ్రులు విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడిని గ్రహించాలి. ఆ ఒత్తిడిని అధిగమించేలా ప్రణాళికలు రూపొందించాలి.
భావిభారత పౌరులైన విద్యార్థులు కళాశాలలు పెట్టే ఒత్తిళ్లకు బలవుతున్నారు. వారానికి ఏడు రోజుల పాటు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు చదువుల పేర విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థలలో బంధీలవుతున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఫీజులు కడుతున్న తల్లిదండ్రులు ర్యాంకుల మాయలో పడి, దాని వలన జరిగే నష్టాన్ని గ్రహించలేకపోతున్నారు.