ప్రభుత్వ పథకాల అమల్లో కీలకం కానున్న’ఐవిఆర్‌ఎస్‌’

Praja Tejam
0


– ఫీడ్‌ బ్యాక్‌ను బట్టి ముందుకెళ్లేందుకు ప్రభుత్వ కార్యాచరణ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుకు సంబంధించి అందుతును పౌర సేవలపై ప్రజల నుంచి నిరంతరం ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మెరుగైన సేవలను నేరుగా లబ్ధిదారులకు అందించాలంటే వారి అభిప్రాయాలను తీసుకోవడం ద్వారా సత్ఫలితాలు అందించవచ్చని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌ (ఐవిఆర్‌ఎస్‌) ఫోన్లు చేయడం ద్వారా ఆయా కార్యక్రమాల అమలు తీరును తెలుసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇకపై లబ్ధిదారులకు ఆయా పథకాల అమలు జరుగుతున్న తీరు, ఎలా చేస్తే బాగుంటుంది? ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా? అనే ప్రశులతో ఐవిఆర్‌ఎస్‌ కాల్స్‌ వెళ్లనునాుయి. వాటిపై ప్రజలిచ్చే రేటింగ్‌ ఆధారంగా ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసుకుని ముందుకునడవాలని భావిస్తోంది. ముఖ్యంగా ఇంటింటికీ పింఛన్లు, దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ వంటి పథకాల లబ్ధిదారుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోనున్నారు. పింఛన్‌ సక్రమంగా ఇంటి వద్దనే అందుతుందా? లేదా? దీపం పథకం కింద ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పొందడంలో ఏమైనా ఇబ్బందులున్నాయా వంటి ప్రశుల ద్వారా లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించనుంది. వీటితో పాటు ఉచిత ఇసుక విధానం అమలు, మద్యం కొత్తపాలసీ అమలు వంటివాటిపైన ప్రస్తుతానికి ప్రజల నుంచి అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించనుంది. రానును రోజుల్లో రెవెన్యూ, మున్సిపల్‌, విద్యుత్తు వంటి కీలక శాఖల్లో ప్రజలు పొందుతును పౌరసేవలపైనా ఐవిఆర్‌ఎస్‌ ద్వారా ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించింది. అదే తరహాలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల్లో కూడా బాధ్యత పెంచి మంచి సేవలు ప్రజలకు అందేలా చేయాలనిప్రభుత్వం భావిస్తోంది. ఫోన్‌ కాల్స్‌ కోసం ప్రజలు రెండు మూడు నిమిషాలు కేటాయించి జవాబులు చెబితే ప్రభుత్వం నుంచి మెరుగైన సేవలందించేందుకు సులభంగా ఉంటుందని సిఎం చంద్రబాబు ఇటీవల పేర్కొన్నారు. మంచిపాలనకు, నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించే కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఈ విధానానిు విజయవాడ బుడమేరు వరదల సమయంలోనూ, పార్టీ అభ్యర్థుల ఖరారు విధానంలోనూ అమలు చేశారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">