అపార్ అప్డేషన్ లో సమస్యలకు వెంటనే పరిష్కారం చూపించాలి
December 03, 2024
0
- : రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్
- : బెలుగుప్ప మండలం కోనాపురం - గోళ్ల గ్రామం మధ్యలో పొలాల్లోకి వెళ్లి కూలీల సమస్యను తెలుసుకున్న మంత్రి పయ్యావుల కేశవ్
అనంతపురం, డిసెంబర్ 02 ప్రజా తేజమ్
- అపార్ అప్డేషన్ లో సమస్యలు రాకుండా చూడాలని, ఈ సమస్యకు వెంటనే పరిష్కారం చూపించాలని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ సూచించారు. సోమవారం బెలుగుప్ప మండలం కోనాపురం నుంచి గోళ్ల గ్రామం మధ్యలో పొలాలలో పని చేస్తున్న కూలీలతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ మాట్లాడారు. ఈ సందర్భంగా పొలాల్లోకి వెళ్లి కూలీల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. మీకు ఎంత కూలి వస్తుంది ఎక్కడ నుంచి వస్తున్నారు అంటూ పలు వివరాలను ఆరా తీశారు. విద్యార్థుల అపార్ అప్డేషన్ కు సంబంధించి ఆధార్ జనరేషన్లో నోటరీ అడుగుతున్నారని, ఇందుకు 800 వరకు వరకు ఖర్చు అవుతుందని, చాలా ఇబ్బందులు పడుతున్నామని కూలీలు తెలియజేశారు. అనంతరం రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, కళ్యాణదుర్గం ఆర్డీవో వసంత బాబులతో మంత్రి ఫోన్ ద్వారా మాట్లాడారు.
- ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బెలుగుప్ప నుంచి కళ్యాణదుర్గంకు వెళ్లి రావడానికి, చార్జీలు, ఫీజులు, నోటరీ చేయించేందుకు, ఆధార్ సర్వీస్ సెంటర్ లో డబ్బులు చెల్లించేందుకు, ఖర్చులు కలిపి దాదాపు రెండు, మూడు వేల రూపాయల వరకు అవుతోందని, 30, 35 శాతం విద్యార్థులు నేమ్ చేంజ్, డేట్ అఫ్ బర్త్, తదితర వివరాల మార్పు చేసుకోవాల్సి ఉందని, అందుకు నోటరైజ్ అఫిడవిట్ అడుగుతున్నారని, నేను దారిలో పోతూ పొలంలోకి వెళ్లి విజిట్ చేస్తే కూలీలు చెప్పిన బాధలు ఇవి అని తెలిపారు. ఈ సమస్యకు వెంటనే పరిష్కారం చూపించాలన్నారు. ఆధార్ సెంటర్ లతో మాట్లాడుకుని స్థానికంగా సమస్యకు పరిష్కారం చేయాలని, డివిజన్లో ఎలాంటి సమస్యలు రానీయకుండా చూసుకోవాలన్నారు. సచివాలయానికి మార్చగలిగితే సగం బరువు తగ్గిపోతుందని, అపార్ సమస్యకు రెండు రోజుల్లోపు త్వరితగతిన పరిష్కారం చూపించాలని సూచించారు.
Tags