ఉపాధి హామీ పనులపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి

Praja Tejam
0



- : వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

అనంతపురం, డిసెంబర్ 02  ప్రజా తేజమ్ :

- జిల్లాలో ఉపాధి హామీ కింద కేటాయించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, ఉపాధి పనులపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టర్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద డ్వామా పిడి, ఎంపిడిఓలు, ఎపిడిలు, ఎపిఎంలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

- ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని, క్షేత్రస్థాయిలో ఉదయం 6:30 గంటలకు ఉపాధి హామీ సిబ్బంది, ఎపిఓలు, ఈసిలు, టెక్నికల్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ఫీల్డ్ అసిస్టెంట్లతో పనిచేయించాలన్నారు. ఏపిడీలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ఉపాధి హామీ పనులను మానిటర్ చేయాలని ఆదేశించారు. వేజ్ సీకర్స్ ని మొబిలైజ్ చేయాలని, కేటాయించిన మేరకు ఉపాధి పనుల లక్ష్యాలను చేరుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఉపాధి హామీ కింద సిసి రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రతివారం 250 పనులు పూర్తి చేయాలని, మండలాల వారిగా లక్ష్యాలను నిర్దేశించి పనులు చేపట్టాలన్నారు. సీసీ డ్రైన్స్ కి సంబంధించి ప్రతివారం 75 పనులు పూర్తి చేసేలా వేగవంతం చేయాలన్నారు. డిసెంబర్ 31వ తేదీ నాటికి జిల్లాలో అన్ని మండలాలలో మంజూరై గ్రౌండింగ్ చేసిన క్యాటిల్ షెడ్స్ ను పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనులను ప్రతి గ్రామంలోనూ చేపట్టాలని, రెండు వారాలులోపు ఖాళీ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించాలని, జిల్లాలో ఎక్కడా ఖాళీలు ఉండరాదన్నారు. లేబర్ బడ్జెట్ అచీవ్మెంట్ కి సంబంధించి డిసెంబర్ 26వ తేదీ నాటికి కేటాయించిన లక్ష్యాన్ని పూర్తిచేయాలన్నారు. జిల్లాలో విడపనకల్లు, వజ్రకరూరు, ఉరవకొండ, కూడేరు, తదితర మండలాలు ఉపాధి హామీ పనుల పురోగతిలో వెనుకబడి ఉన్నాయని, ఆయా మండలాల్లో ఉపాధి పనుల్లో సరిగా పురోగతి కనిపించడం లేదని, మొదటినుంచి పనుల్లో పురోగతి లేకపోవడం వల్ల విడపనకల్లు ఏపీవోపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవాలన్నారు. హౌసింగ్ పురోగతిపై ఫిజికల్ మీటింగ్ తీసుకొని సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డ్వామా పిడి సలీం భాష, హార్టికల్చర్ డిడి నరసింహారావు, హౌసింగ్ పిడి శైలజ, పీఆర్ ఎస్ఈ జహీర్ అస్లాం, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">