IND vs BAN: చరిత్ర సృష్టించిన టీమిండియా.. తొలి జట్టుగా వరల్డ్ రికార్డ్!

Praja Tejam
0

 


టీ20 క్రికెట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. బంగ్లాదేశ్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ఈ ఫీట్ సాధించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్లకు 297 పరుగుల భారీ స్కోర్ చేసింది.

సంజూ శాంసన్(47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 111) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్(35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.

చివర్లో రియాన్ పరాగ్( 13 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 34), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) మెరుపులు మెరిపించారు. ఈ భారీ స్కోర్‌తో టీమిండియా పలు రికార్డులను నమోదు చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోర్ నమోదు చేయడంతో పాటు అత్యంత వేగంగా 100, 150, 200, 250 పరుగుల మార్క్‌ను అందుకున్న జట్టుగా చరిత్రకెక్కింది.

ఆల్‌టైమ్ రికార్డ్ స్కోర్..

ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. టెస్ట్ హోదా కలిగిన జట్లలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా టీమిండియా నిలిచింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోర్ రికార్డ్ పసికూన నేపాల్ పేరిట ఉంది. మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ 314/3 భారీ స్కోర్ నమోదు చేసింది.

రెండో స్థానంలో టీమిండియా తాజా ఇన్నింగ్స్ నిలవగా.. మూడో స్థానంలో అఫ్గానిస్థాన్ ( ఐర్లాండ్‌తో 278/3), నాలుగో స్థానంలో చెక్ రిప్లబిక్(టర్కీతో 278/4), ఐదో స్థానంలో మలేసియా(థాయ్‌లాండ్‌తో 268/4), ఆరో స్థానంలో ఇంగ్లండ్(వెస్టిండీస్‌తో 267/3) కొనసాగుతోంది.

అత్యధిక బౌండరీల రికార్డ్..

అంతర్జాతీయ టీ20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీలు బాదిన జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది. తాజా మ్యాచ్‌లో 25 ఫోర్లు, 22 సిక్స్‌లతో మొత్తం 47 బౌండరీలు బాదింది. ఈజాబితాలో భారత్ తర్వాత చెక్ రిపబ్లిక్(43), సౌతాఫ్రికా(42), శ్రీలంక(41), అఫ్గానిస్థాన్(41) తర్వాతి స్థానంలో నిలిచాయి. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన టీమ్స్ జాబితాలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">