మడకశిర అక్టోబర్ 13 ప్రజా తేజమ్
మడకశిర మండలం బుల్ల సముద్రం గ్రామ పంచాయతీలో 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా బుళ్ళసముద్రం గ్రామ పంచాయతీని ఎమ్మెస్ రాజు మరియు మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వచ్చిన సందర్భంగా బుల్లసముద్రం గ్రామ ప్రజలు మరియు బీరాయపురం గ్రామ ప్రజలు గ్రామాలలో నీటి కొరత ఉందని తెలియజేయడం జరిగింది. ఆరోజు ఎమ్మెస్ రాజు మాజి ఎమ్మెల్సీ హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం నిన్నటి రోజు బుల్లసముద్రం గ్రామంలో ఈరోజు బీ రాయపురం గ్రామంలో బోర్లు వేయించడం జరిగినది బుల్లసముద్రం గ్రామంలో మూడు ఇంచుల నీరు దొరికింది గ్రామపంచాయతీ ప్రజలు చాలా సంతోషించారు. గ్రామపంచాయతీ ప్రజల దాహార్తి తీర్చిన మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు గారిని మరియు గుండుమల తిప్పేస్వామి గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జైపాల్ , మాజీ ఉపసర్పంచ్ రాధాకృష్ణ, క్లస్టర్ ఇంచార్జ్ నాగేంద్ర ,జనసేన నాయకులు నాగభూషణ ,ఎస్సీ సెల్ నాగేష్, కిరణ్, మారుతి ,ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది