- : జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
అనంతపురం, అక్టోబర్ 24 ప్రజా తే జమ్ : - టపాకాయల విక్రయ దుకాణదారులు సురక్షాపరమైన జాగ్రత్తలు తీసుకోనేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. గురువారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల విక్రయ దుకాణదారులు తీసుకోవలసిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా G.O.Rt.No.692 మరియు ఏకసభ్య విచారణ కమిటీ (One Man inquiry committee) ప్రకారం ముందు జాగ్రత చర్యలు తీసుకొనవలసినదిగా జిల్లా అధికారులకు, రెవెన్యూ డివిజినల్ అధికారులకు తెలియజేశారు. డివిజన్ స్థాయి మరియు మండల స్థాయిలో అధికారులతో సమావేశాలు నిర్వహించి తీసుకోవలసిన చర్యలు తెలియజేస్తూ సంబంధిత మినిట్స్ ను కలెక్టర్ వారి కార్యాలయమునకు సమర్పించవలసినదిగా ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ రామకృష్ణారెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్ కుమార్, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.