ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం , సీఐడీ విచారణకు ఒకేసారి మూడు కీలక కేసులు...

Praja Tejam
0

 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకేసారి మూడు కీలక కేసులను సీఐడీ విచారణకు అప్పగించింది. టీడీపీ కార్యాలయం పై దాడి కేసు తో పాటుగా సంచలనం సృష్టించిన సినీనటి కాదంబరీ జెత్వానీ కేసునూ సీఐడీకి అప్పగిస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీచేశారు.

ఈ నిర్ణయంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ముఖ్యలకు ఉచ్చు బిగుస్తోంది. జెత్వానీ కేసులో వైసీపీ ముఖ్య నేతలను విచారించే అవకాశం ఉంది. వైసీపీ హాయంలో నాటి సీఎంఓ, డీజీపీ కార్యాలయంతో పాటుగా విజయవాడ లో పని చేసిన కీలక పోలీసు అధికారుల పై అభియోగాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసు విచారణ కొనసాగుతోంది. పోలీసు అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఇందులో వైసీపీ నేత విద్యా సాగర్ ను పోలీసులు విచారించారు.

బెదిరింపులతోనేనా..

టీడీపీ ఆఫీసుపై దాడి, చంద్రబాబు ఇంటిపై దాడుల ఘటనలకు నాటి పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో సహకరించారు. ప్లాన్ అమలులో వారిది కీలక పాత్ర. ఆ వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం దర్యాప్తు అధికారులపై కొంత మంది ఐఎస్‌లు ప్రత్యక్ష, పరోక్ష బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే నిందితుల అరెస్టు విషయంలోనూ ఆలస్యం చేశారు. ఇక జెత్వానీ కేసు సంగతి చెప్పాల్సిన పని లేదు. సీనియర్ ఐపీఎస్ అధికారులు ఇందులో ఉన్నారు. వీరు చేసింది చిన్న నేరం కాదు. అత్యంత ఘోరం. ఐపీఎస్ సర్వీసులో ఉండే అర్హతను కోల్పోయినంత నేరం. అందుకే ఆ కేసు దర్యాప్తు అధికారిపై గుక్కుతిప్పుకోలేనంత ఒత్తిడి తెచ్చారు. రఘురామ కేసు వ్యవహారంలో చాలా రోజుల పాటు పరారీలో ఉన్న సీఐడీ మాజీ పోలీసు విజయ్ పాల్ విచారణకు వచ్చి దర్యాప్తు అధికారినే దబాయించి పోయారన్న చర్చ జరుగుతోంది. ఎందుకు చెప్పాలి.. ఏమైనా ఉంటే కోర్టులో చెబుతా.. నువ్వేంటి అడిగేది అని దబాయించడం… అతని వెనుక చాలా పెద్ద పోలీసు అధికారులు ఉన్నారన్న భయంతో ఆ దర్యాప్తు అధికారి కఠినంగా వ్యవహరించలేకపోయారు. విషయం తెలిసిన ఉన్నతాధికారులు ప్రకాశం జిల్లా ఎస్పీకి కేసు విచారణ బాధ్యతను అప్పగించారు. మరోసారి విజయ్ పాల్ ను ప్రశ్నించనున్నారు.

ప్రభుత్వ నిర్ణయం వెనుక

కేసులను సీఐడీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా గన్నవరం టీడీపీ కార్యాలయం..చంద్రబాబు నివాసం దాడులను కూటమి ప్రభుత్వం సీరియస్ గా పరిగణించింది.ఈ కేసుల తీవ్రత..వాటి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను పట్టుకునేందుకు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ రెండు కేసులను సీఐడీకి బదిలీ చేయాలనే ఈ నిర్ణయంతో ఇందులో ప్రమేయం ఉన్న వారికి ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న నేతలను పోలీసులు విచారించారు. గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పైన అభియోగాలు ఉన్నాయి. మిగిలిన వారు సుప్రీంకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. వారి విచారణకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దే విధంగా చంద్రబాబు ఇంటి పైన దాడి కేసులో ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేశ్ ను పోలీసులు విచారించారు. ఈ రెండు కేసుల్లో వైసీపీకి చెందిన క్రిష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు నేతలు ఉన్నారు. పార్టీ ముఖ్య నేత సజ్జల ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఇక, ఇప్పుడు ఈ మూడు కేసులు సీఐడీకి అప్పగించటంతో ఇందులో ప్రమేయం ఉందని భావిస్తున్న వైసీపీ నేతల మెడకు ఉచ్చు ఖాయంగా కనిపిస్తోంది. ప్రధానంగా జెత్వానీ కేసులో వైసీపీ హయాంలో కీలక స్థానాల్లో ఉన్న ముఖ్య నేతలను విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో, సీఐడీ నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

బెదిరింపులతోనేనా..                            ప్రభుత్వ నిర్ణయం వెనుక

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">