: తాసిల్దార్ ఫణి కుమార్
కనేకల్లు ప్రజాతేజం అక్టోబర్ 24 కనేకల్ మండలంలోని మాల్యం దగ్గర గల వేదవతి హగిరి ఉదృతంగా ప్రవహిస్తున్నడడం వలన నది వద్దకు ప్రజలు ఎవరు వెళ్లరాదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాసిల్దార్ ఫణికుమార్ కనేకల్ మాల్యం తదితర గ్రామాల ప్రజలకు సూచించారు. రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలం లోని భైరవాణి తిప్ప ప్రాజెక్టులో కి కర్ణాటక నుండి నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో గురువారం మూడు గేటులను వేదవతి హగిరి నదికి వదిలారు దీనివలన నీరు ఉదృతంగా ప్రవహించే అవకాశం ఉంది కాబట్టి మాల్యం కనేకల్లు రహదారి వేదవతి హగిరి మీదుగా ఉండేది ఈ రోడ్డును కి ఇరువైపులా ముళ్ళకంపలను వేసి రోడ్డును పూర్తిగా తాసిల్దార్ మూసి వేయించారు ప్రజలు ఎవరు ఈ రోడ్డు నందు రాకపోకలు నడప రాదని కొద్దిగా లేట్ అయినా సరే చెరువు కట్ట రోడ్డుపైనే వెళ్లాలని ప్రజలకు సూచించారు. ఏదైనా క్లిష్టమైన సమస్య ఏర్పడినప్పుడు గ్రామాల్లోని వీఆర్ఏలు గాని వీఆర్వో కి గాని తాసిల్దార్ గాని సమాచారాన్ని అందించాలని ఆయన తెలిపారు