నేటికీ అశోక వనం జాడలు.. సీతాదేవి ఆలయం ఎక్కడ ఉందంటే

Praja Tejam
0


 శ్రీలంకలో సీత అమ్మన్ ఆలయం.. ఇది సీత అమ్మన్ కోవిల్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం సీతా దేవిని లంకాధీశుడు రావణుడు సీతను బందీగా ఉంచిన ప్రదేశం.

ఇక్కడి విశేషమేమిటంటేఇక్కడ లక్షల అశోక వృక్షాలు ఉన్నాయి. ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని విశేషాలను గురించి ఈ రోజు తెలుసుకుందాం..5000 వేల సంవత్సరాల నాటి శిల్పాలు: సీతా దేవాలయాన్ని సీతా ఎలియా అని కూడా అంటారు. ఈ ఆలయంలోని రాముడు, లక్ష్మణుడు, సీత విగ్రహాలు సుమారు 5000 సంవత్సరాల నాటివని నమ్ముతారు. సీతను బందీగా ఉంచిన ఐదు ప్రదేశాలలో ఇది ఒకటి.రావణుడి రాజభవనం ఉన్న ఈ ఆలయానికి ఎదురుగా ఒక పర్వతం ఉందని కూడా నమ్ముతారు. ఇక్కడ ప్రధాన ఆకర్షణ హనుమంతుని పాదముద్రలు కనిపిస్తాయి.అశోక వనం: హిందూ పురాణాలలో అశోక వనం అని పిలువబడే సీతా ఎలియా అదే ప్రదేశం. సీతా దేవి కోసం వెతుకుతున్న సమయంలో హనుమంతుడు మొదటిసారిగా శ్రీలంక గడ్డపై అడుగు పెట్టిన ప్రదేశం ఇదే అని నమ్ముతారు.అశోక చెట్టు కింద ఉన్న సీతాదేవిని చూసిన హనుమంతుడు రామయ్య ఇచ్చిన ఉంగరాన్ని చూపించాడు. సీతదేవి అనుమతి తీసుకున్న తరువాత హనుమంతుడు తన ఆకలిని తీర్చుకోవడానికి అశోక్ వనాన్ని మొత్తాన్ని నాశనం చేశాడు.

దగ్ధంకాని అశోక వనం: ఈ ఆలయంలో ఉన్న అశోక వనం గురించి ఒక నమ్మకం ఉంది. హనుమంతుడు లంకా దహనం చేసే సమయంలో సీతాదేవి ఉన్న అశోక వనం దహనం అవ్వలేదు.

సీతా నది. సీతా ఎలియా ఆలయం దగ్గరగా ఒక నది ప్రవహిస్తుంది. ఈ నదిని సీత అని పిలుస్తారు. ఈ సీతా నది తీరంలో ఒక వైపు మట్టి పసుపు రంగులో ఉంటుంది. మరో వైపు మట్టి కాలిపోవడంతో నల్లగా కనిపిస్తుంది. ఇక్కడ సీతా దేవి స్నానం చేసి రోజూ ప్రార్థనలు చేసిందని నమ్ముతారు

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">