- : జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
అనంతపురం, అక్టోబర్ 13 ప్రజాతేజమ్:
- పారదర్శకంగా మద్యం టెండర్లకు సంబంధించి ఓపెన్ లాటరీ నిర్వహించేందుకోసం అన్ని చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. ఆదివారం సాయంత్రం నగరంలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో మద్యం టెండర్ల కోసం అవసరమైన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పరిశీలించారు.
- ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలసీ ప్రకారం మద్యం టెండర్లకు సంబంధించి ఓపెన్ లాటరీ నిర్వహించేందుకోసం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. జిల్లాలో 136 మద్యం షాపులకు సంబంధించి మద్యం టెండర్లకు జేఎన్టీయూ ఆడిటోరియంలో ఓపెన్ లాటరీ ప్రక్రియను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. సోమవారం ఉదయం ఏడు గంటలకు ఓపెన్ లాటరీ ప్రక్రియ మొదలవుతుందని, ఇందుకోసం రెండు కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, దరఖాస్తుదారుడికి ఎంట్రీ పాసులు ఇవ్వడం జరుగుతుందని, వారిని మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. ఓపెన్ లాటరీ ప్రక్రియను ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామ్మోహన్ రెడ్డి, సిఐలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.