సకాలంలో స్పందించి భారీ నష్టాన్ని అరికట్టాం

Praja Tejam
0


- : ప్రజలు, అధికారులు, మీడియా భాగస్వామ్యంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాం

- : ఇళ్ల నష్టానికి సంబంధించి ఈనెల 26వ తేదీన నష్టపరిహారం అందిస్తాం.. నేరుగా బాధితుల ఖాతాల్లోకి జమ చేస్తాం..

- : వాగులు, వంక పోరంబోకు భూముల ఆక్రమణలపై రెవెన్యూ, మున్సిపల్, సివిల్ సప్లైస్, సర్వే శాఖలతో జాయింట్ సర్వే చేపడతాం

- : పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

అనంతపురం, అక్టోబర్ 24 ప్రజా తేజమ్ - జిల్లాలో అనుకోకుండా వచ్చిన వరదలతో ప్రాణం నష్టాన్ని నివారించామని, సకాలంలో స్పందించి భారీ నష్టం జరగకుండా అరికట్టామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ స్పష్టం చేశారు.

- అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం సాయంత్రం ఆకస్మిక వరదలు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

- ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం పైనున్న పరివాహక ప్రాంతాల్లో, కొద్ది రోజులుగా కర్ణాటకలో భారీ వర్షాలు రావడం, శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా ఈనెల 16, 17 వ తేదీలలో భారీ వర్షం రావడంతో మొత్తం పైన ఉన్న ప్రాంతాలు పూర్తిగా సంతృప్త స్థాయిలో నిండి ఉండడంతో, అనుకోకుండా మూడు గంటల్లో అంచనా వేయలేని వర్షపాతం కురవడం వల్ల, పైన ఉన్న పావగడ, కనగానపల్లి, రాప్తాడు నుంచి పండమేరు వంక ద్వారా అనంతసాగరం మరియు బుక్కరాయసముద్రం చెరువుకు వరద నీరు చేరుకుందన్నారు. కనగానపల్లిలో 15 సెంటీమీటర్ల వర్షం కురవడంతో ఆ నీరు కిందికి వచ్చిందని, జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ తెల్లవారుజామున 3 నుంచి 3:30 గంటల మధ్య నగర శివారు ప్రాంతాలకు చేరుకోగా, స్థానికులు ఫోన్ చేయడంతో వెంటనే అప్రమత్తమై వరద నీటిలో చిక్కుకున్న 110 కుటుంబాలను రెవెన్యూ అధికారులు, పోలీసులు కాపాడడం జరిగిందన్నారు. మరొక కుటుంబం మిద్దెపైకి చేరుకోవడంతో వారిని అనంతపురం ఫైర్ స్టేషన్ నుంచి ల్యాడర్ తెప్పించి కాపాడే ప్రక్రియ ఉదయం 7 గంటలకు సంపూర్ణమైందన్నారు. మరో నాలుగు కాలనీలు, రామకృష్ణ కాలనీ చుట్టుపక్కల 2 కాలనీలు, ఒక ఒక స్కూలులోకి నీరు చేరగా, మూడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 375 మంది వరద బాధితులను అక్కడికి తరలించి వారికి భోజన సదుపాయం కల్పించామన్నారు. వరద బాధితులకు మొత్తం 1,995 ఆహార పొట్లాలు, 560 బిస్కెట్ ప్యాకెట్లను, 5,535 వాటర్ ప్యాకెట్లను, 620 మందికి పాలను అందించడం జరిగిందన్నారు. అలాగే 361 మందికి పైగా వరద బాధితులకు ఒక్కో కుటుంబానికి బియ్యం, కంది బేడలు, పామోలిన్, ఉల్లిగడ్డలు, బంగాళా దుంపలు అందివ్వడం జరిగిందని తెలిపారు. వర్షాల వల్ల జిల్లాలో 456.92 హెక్టార్లలో వ్యవసాయ పంటలు నష్టమై రూ.2.66 కోటి రూపాయలు, ఉద్యాన పంటలకు సంబంధించి 68.20 హెక్టార్లలో రూ.73.19 లక్షలు, నాలుగు లక్షల విలువగల 40 కచ్చా ఇళ్లు నష్టం కాగా, 2 పశువులు, 10 లక్షల రూపాయల విలువగల 100 మేకలు నష్టపోగా, వాటికి సంబంధించి ప్రాథమిక అంచనా వేయడం జరిగిందన్నారు. జీవో ఎంఎస్ నెంబర్ 5 మరియు ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం 48 గంటలు వరద నీటిలో చిక్కుకొని ఉన్న వారికి నష్టపరిహారం అందివ్వాల్సి ఉండగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు నిత్యావసర సరకులను బుధవారంతో మొదలుపెట్టి గురువారం నాటికి పంపిణీ చేయడం జరిగిందన్నారు.

- భారీ వర్షాలు, వరదలకు సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ తో తాను మాట్లాడుతూ తాజా సమాచారాన్ని వారికి చేర వేయడంతో పాటు ఎప్పటికప్పుడు వరద సమాచారాన్ని తెలుసుకుంటూ ప్రజలను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసామని, దాంతో ప్రాణనష్టాన్ని నివారించగలిగామన్నారు. శుక్ర, శనివారాల్లో ఇళ్ల నష్టానికి సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి అంచనాలను రూపొందించి తమకు తెలియజేస్తారని, ఈనెల 26వ తేదీన నష్టపరిహారం అందించడం జరుగుతుందన్నారు. వరద బాధితుల ఆధార్ లింక్ కలిగిన బ్యాంక్ అకౌంట్లకు నేరుగా పరిహారం జమ చేయడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి నష్టపరిహారాన్ని అంచనా వేయడంలో నియమ నిబంధనలు పాటించాల్సి ఉందని, ఆ మేరకు అధికారులు నష్ట నివేదికలు అందించిన తర్వాత వారికి కూడా నష్టపరిహారం అందజేస్తామన్నారు.

- వాగులు, వంక పోరంబోకు భూముల ఆక్రమణలపై జాయింట్ సర్వే జరుగుతోందని, రెవెన్యూ, మున్సిపల్, సివిల్ సప్లైస్, సర్వే శాఖలతో జాయింట్ సర్వే చేస్తామన్నారు. వరదల వల్ల ఇల్లు నష్టపోయిన బాధితులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్హత మేరకు ఇళ్లను మంజూరు చేయడానికి సంబంధించి నోటీసులు అందజేసి నష్టాన్ని అంచనా వేయడం జరుగుతుందన్నారు. అర్హత కలిగిన వారికి ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నుంచి తనకు ఆదేశాలు అందాయన్నారు. జిల్లాలో అనుకున్న మేరకు వర్షం కురవనప్పటికీ భైరవానితిప్ప ప్రాజెక్టు నుంచి 800 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోందన్నారు. కర్ణాటకలో కురిసిన భారీ వర్షాల వల్ల 5,000 క్యూసెక్కులు మరియు 2,000 క్యూసెక్కులు నీరు ఎక్కువ, తక్కువలుగా జిల్లాకు వస్తోందన్నారు. చాగల్లు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడం జరిగిందని, చిత్రావతి రిజర్వాయర్ ఇంకా వరద నీరు రాలేదని, అయితే రిజర్వాయర్ నీటితో నిండిందన్నారు. హగరి, పెన్నా, చిత్రావతి, పండమేరు వంక పరివాహక ప్రాంతాల్లో ఇంకా వర్షం కురిస్తే నీరు పారుతుందని, ఈ విషయమై జిల్లాలో ప్రజలందరినీ అప్రమత్తం చేయడం జరుగుతోందన్నారు. ప్రజలు, అధికారులు, మీడియా భాగస్వామ్యంతో జిల్లాలో ఎలాంటి ప్రాణా నష్టం జరగకుండా చర్యలు తీసుకోగలిగామన్నారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదుర్కునేందుకు తమ అధికార యంత్రం సిద్ధంగా ఉందన్నారు.

- రాబోయే రోజుల్లో ఆక్రమణలపై రెవెన్యూ డివిజన్ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణలు ఉంటే వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జీవో ఎంఎస్ నంబర్ 5 అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, సవివరమైన నివేదికలు అందాకే పండించిన పంటల నష్టాలపై అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదించి నష్టపరిహారం అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. నడిమి వంక, మరువ వంక పైభాగాన ఉపాధి హామీ కింద నీటి సంరక్షణ పనులు (వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్) చేపట్టేందుకు ఒక సంవత్సరంలోపు చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రూపొందించామన్నారు.

- ఈ సమావేశంలో అనంతపురం ఆర్డీఓ వసంతబాబు, డిపిఎం ఆనంద్, కలెక్టరేట్ కో ఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ యుగేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">