భారీ వర్షాల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

Praja Tejam
0


- : అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి

- : జిల్లా, మండల స్థాయిలో కమాండ్ కంట్రో



ల్ రూమ్ లను ఏర్పాటు చేయాలి

- : వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

అనంతపురం, అక్టోబర్ 13 :ప్రజాతేజమ్ 

- జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఆదివారం అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి భారీ వర్షాల నేపథ్యంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.


- ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో ఈనెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు భారీ వర్షపాతం కురిసే అవకాశమున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా, మండల స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలన్నారు. ఆయా మండల స్థాయిలో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేయాలన్నారు. ఆయా శాఖల అధికారులు వారి శాఖల పరిధిలో చేపట్టాల్సిన యాక్టివిటీలను చేపట్టాలని, ఆయా శాఖల పరిధిలో ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలన్నారు. పశువులకు సంబంధించి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పశుసంవర్ధక శాఖ అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టాన్నారు. వర్షాలు వల్ల కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లలో ఎవరు ఉండకుండా చూడాలని, వర్షాలు వస్తున్నాయని ప్రజలకు తె3లియజేయాలన్నారు. విద్యుత్ పోల్స్ పడిపోతే వెంటనే వాటిని పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉండాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈని ఆదేశించారు. వర్షాలు నేపథ్యంలో మున్సిపాలిటీలలో, మండల స్థాయిలో పూడికతీత చేపట్టేందుకు జెసిబిలను సిద్ధంగా ఉంచాలన్నారు. ఆయా పీహెచ్సిల పరిధిలో గర్భవతులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, మూడు వారాలలోపు ప్రసవం అయ్యే వారిని ఆయా మెడికల్ అధికారులు, సిహెచ్ఓలు తనిఖీ చేసేలా చూడాలని డిఎంహెచ్ఓని ఆదేశించారు. ఒకేసారి భారీ వర్షం కురిస్తే పలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని, సమస్యలు పరిష్కరించేందుకు, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. రిజర్వాయర్ లను, కాలువలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, మైనర్ ఇరిగేషన్, హెచ్ఎల్సి, హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు, రెడ్ క్రాస్, పోలీస్, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా చూసుకోవాలని, వర్షాలపై అవగాహన కల్పించాలన్నారు. అధికారులందరూ నిరంతరమా ప్రముత్తంగా ఉంటూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">