కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర రెండు వారాల థియేట్రికల్ రన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసి మూడో వారంలోకి ఎంటరైంది. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు లాభాలను అందిస్తున్న దేవర లాంగ్ రన్‌లో ఏ మేరకు హోల్డ్ చేస్తాడో చూడాలి.
యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. జాన్వీ కపూర్ , సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్ల ద్వారా వచ్చిన హైప్‌కు తోడు కొరటాల - ఎన్టీఆర్ కాంబినేషన్ కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.112.55 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.182.55 కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో రూ.200 కోట్ల షేర్, రూ.400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దేవరకు ఫిక్స్ చేశారు ట్రేడ్ పండితులు.
ప్రపంచవ్యాప్తంగా 7250 థియేటర్‌లలో గ్రాండ్‌గా రిలీజైన దేవర .. ఓపెనింగ్స్‌ని ఇరగదీసింది. మొదటి రోజు రూ.172 కోట్లు, రెండో రోజు రూ.71 కోట్లు, మూడో రోజు రూ. 40 కోట్లు, నాలుగో రోజు రూ. 25 కోట్లు, ఐదో రోజు రూ.40కోట్లు, ఆరో రోజు రూ.40 కోట్లు, ఏడో రోజు రూ.20 కోట్లు, ఎనిమిదో రోజు రూ.13 కోట్లు, 9వ రోజు రూ.12 కోట్లు, 10వ రోజు రూ.19 కోట్లు, 11వ రోజు రూ.9 కోట్లు, 12వ రోజు రూ.7 కోట్లు, 13వ రోజు రూ.6.5 కోట్లు, 14వ రోజు 5.3 కోట్లు, 15వ రోజు రూ.6 కోట్లు వసూలు చేసింది.
16వ రోజు దసరా పర్వదినం కావడంతో అన్ని చోట్లా హౌస్‌ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. చాలా ఏరియాలో రిలీజ్ డే నాటి పరిస్ధితులు కనిపించాయి. పండగపూట ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తడంతో బుకింగ్స్ ఓ రేంజ్‌లో జరిగాయి. 16వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.4.58 కోట్లు, హిందీ, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. కోటి చొప్పున మొత్తంగా రూ.7 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
దేవర బాక్సాఫీస్ వద్ద 16 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.215 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ.418 కోట్లకు పైగా గ్రాస్ మార్క్‌ను అందుకుంది. అయితే రూ.500 కోట్ల టార్గెట్ కొడుతుందా లేదా అన్నది అనుమానంగా ఉంది. కొత్త సినిమాల రాకతో తెలుగు రాష్ట్రాలు, హిందీ, ఓవర్సీస్‌లో దేవర కాస్త స్లో అయ్యింది. ఆదివారంతో పండుగ సెలవులు కూడా పూర్తి కాబోతుండటంతో బుకింగ్స్ తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.