TTD: బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు టీటీడీ కీలక సూచన..!!

Praja Tejam
0

 

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. ప్రధానంగా అక్టోబర్ 8న జరిగే గరుడసేవ నాడు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. ఇందు కోసం రవాణాతో పాటుగా ఇతర సౌకర్యాల పైన అధికారులు పలు నిర్ణ

యాలు తీసుకున్నారు.

ప్రత్యేక దర్శనాలను రద్దు చేసారు. అదే సమయంలో భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది.

ప్రత్యేక దర్శనాల రద్దు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం దివ్యాంగులు, వృద్ధులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు సహా అన్ని ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు. గరుడ సేవను పురస్కరించుకొని అక్టోబర్‌ 7వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్‌ 9న ఉదయం 6 గంటల వరకు రెండు ఘాట్‌రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలు నిషేధించినట్లు తెలిపారు.

ఆర్టీసీ వినియోగించండి

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలో తగినంత పార్కింగ్ లేకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులను నివారించడానికి, ముఖ్యంగా అక్టోబర్ 8న గరుడసేవ రోజున భారీగా వచ్చే భక్తుల రద్దీని దృష్ట్యా ఆర్టీసీ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

ప్రత్యేక ఏర్పాట్లు

గరుడ సేవ రోజున భక్తులను తిరుమలకు తరలించడానికి ఏపిఎస్ఆర్టీసీ తగిన సంఖ్యలో బస్సులను నడపాలని కోరారు. అలిపిరి లింక్ బస్టాండ్, మున్సిపల్ గ్రౌండ్స్, వినాయక నగర్ క్వార్టర్స్‌లో ద్విచక్ర వాహనాలు, భారతీయ విద్యాభవన్ స్కూల్‌లో ప్రైవేట్ జీపులు, కార్లు సహా అన్ని నాలుగు చక్రాల వాహనాలు, ఎస్వీ జూ పక్కనే ఉన్న దేవలోక్‌లో ప్రైవేట్ బస్సుల కొరకు పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. నాలుగు మాడ వీధులలో ఎప్పటికప్పుడు భక్తుల నుండి ఫీడ్‌బ్యాక్ సేకరణ, యాత్రికుల కొరకు మరిన్ని మే ఐ హెల్ప్ యూ సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">