TTD: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవల ఏర్పాట్లపై ఈవో ప్రత్యేక సమీక్ష

Praja Tejam
0

 


తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఈవో జే శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్ల పురోగతిని సమీక్షించారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం సాయంత్రం టీటీడీ అధికారుల సమీక్షా సమావేశం జరిగింది.

అక్టోబరు 8వ తేదీన గరుడసేవ రోజున అదనపు పార్కింగ్‌ ప్రాంతాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని విజిలెన్స్‌ అధికారులను ఈవో శ్యామలరావు ఆదేశించారు. తిరుమలలో ప్రస్తుతం ఉన్న ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు కలిపి దాదాపు 11, 000 వాహనాలను పార్క్ చేయడానికి సరిపోతాయని అంచనా వేశామని సంబంధిత అధికారులు టీటీడీ ఈవో శ్యామలరావుకు వివరించారు. అదనపు పార్కింగ్ ప్రాంతాల కోసం ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు, బందోబస్తు, అదనపు సిబ్బంది, సీసీటీవీలు, అదనపు లగేజీ సెంటర్ ఏర్పాట్ల కోసం స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశించారు.

అంతకుముందు లడ్డూ కాంప్లెక్స్, పోటును సంబంధిత అధికారులతో కలిసి టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు. ఈ తనిఖీల్లో భాగంగా లడ్డూ కౌంటర్లు, బూందీ పోటులను సందర్శించి లడ్డూల పంపిణీ, బూందీ తయారీ ప్రక్రియను పర్యవేక్షించి శ్రీవారి పోటుపై సేఫ్టీ ఆడిట్‌ చేపట్టాలని టీటీడీ ఈవో శ్యామలరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీకి చెందిన వివిద విభాగల సీనియర్ అధికారులు, పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">