ఈ సినిమా విడుదలైన నాలుగవ రోజున బ్రేక్ ఈవెన్ ని చేరుకొని ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయ్యింది. ఈ చిన్న బడ్జెట్ చిత్రం 20 కోట్ల గ్రాస్ తో ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురిచేసే లాంగ్ రన్‌లో అద్భుతంగా నడిచింది. ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మాత్రమే కాకుండా పరిశ్రమ తారల నుండి కూడా విస్తృతమైన ప్రశంసలను అందుకుంది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం ఈటీవీ విన్ సొంతం చేసుకుంది.
కమిటీ కుర్రోల్లు ఇప్పుడు ETV విన్‌లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి, తెలుగు వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ కోసం సిద్ధంగా ఉంది మరియు ఇతర వెర్షన్ల గురించి ఏమీ సమాచారం లేదు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్లాట్ఫారంలో విడుదలైన తొలి రోజున 70,32,416 గ్రాస్ ని నమోదు చేసినట్లు సమాచారం. ఈ విషయాని తెలియజేసేందుకు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ వంశీ నందిపతి ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేసారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు. అనుదీప్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.