నటి హేమపై ఛార్జ్‌షీట్‌ నమోదు

Praja Tejam
0


 Facebook

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటి హేమకు మరో ఎదురుదెబ్బ తగిలింది. నటి హేమపై ఛార్జ్‌షీట్‌ నమోదయింది. బెంగళూర్‌ రేవ్‌ పార్టీ కేసులో నటి హేమ డ్రగ్స్‌ సేవించినట్టు మెడికల్‌ రిపోర్టులు వచ్చాయి. దీంతో పోలీసులు నటి హేమతో సహా 88 మందిపై ఛార్జ్‌షీట్‌ నమోదు చేశారు. హేమ ఎమ్‌డిఎమ్‌ఎ డ్రగ్స్‌ సేవించినట్లు మెడికల్‌ రిపోర్ట్‌ను పోలీసులు జతపర్చారు. హేమను తన స్నేహితుడు వాసు పార్టీకి పిలిచినట్లు నిర్ధారించారు. చిత్తూరు కు చెందిన డాక్టర్‌ రణ ధీర్‌ బాబుతో సహా 9 మందిపై చార్జ్‌ షీట్‌ దాఖలు అయిందని సమాచారం అందుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">