వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం

Praja Tejam
0


 విలేకరులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి

 ఉరవకొండ:సెప్టెంబర్ 12(ప్రజాతేజం) 

  విజయవాడలో వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని  ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి అన్నారు. గురువారం స్థానిక వైసిపి పార్టీ కార్యాలయంలో  పార్టీ నాయకులతో కలిసి ఆయన  విలేకరులతో మాట్లాడుతూ బాధితులను ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత వ్యక్తం కావడంతో  జగన్మోహన్ రెడ్డి పై అసత్య  ప్రచారాలు చేస్తూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రుల ఇళ్ల వద్దకు నీళ్లు రాకుండా అడ్డుకోవడం వల్ల విజయవాడలో ప్రజలు వరదలలో చిక్కుకొని 60 మంది దాకా ప్రాణాలు కోల్పోయారని  దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి బాధ్యత వహించాలన్నారు.ముందస్తు చర్యలు తీసుకోకుండా ప్రజలను కష్టాలు పాలు చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టడానికి  వైసీపీ పార్టీ నాయకులు పై అక్రమంగా కేసులు బనాయిస్తూ నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అవినీతి అక్రమాల కేసుల్లో సస్పెన్స్ అయినా  అధికారులను తిరిగి వారికి పోస్టింగులు ఇచ్చి  అవినీతి పరులకు ప్రభుత్వం వంత పాడుతోందని ఆరోపించారు. అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ చిన్న గౌస్ ను ఆగ మేఘాల మీద పోస్టింగ్ ఇప్పించేందుకు టిడిపి నాయకులు అత్యుత్సాహం చూపుతున్నారు అన్నారు. అంతే కాకుండా  లాకప్ డెత్  చేసిన వారిని  సర్వీస్ తుపాకులు మిస్సింగ్ చేసిన వారికి  పోస్టింగులు ఇచ్చి  అరాచకాలు చేసేందుకు టిడిపి నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు సాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేయాల్సిన ఐఏబి  సమావేశాన్ని వాయిదాలు వేసుకుంటూ రైతులను గందరగోళానికి ప్రభుత్వం, అధికారులు గురి చేస్తున్నారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో వైసిపి పార్టీ సీనియర్ నాయకులు కెవి రమణ, సుశీలమ్మ, ఉరవకొండ ఎంపీపీ నరసింహులు, పార్టీ నాయకులు బసవరాజు, అశోక్ కుమార్ సుంకన్న తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">