వైద్యాధికారి డాక్టర్ తేజస్వి
ఉరవకొండ:సెప్టెంబర్ 12(ప్రజాతేజం)
నిత్యం పోషక విలువలతో కూడిన ఆహారం భుజించడం ద్వారా రోగాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని వజ్రకరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు తేజస్వి,సర్ధర్ వలి, ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి అన్నారు.మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం పౌష్టికాహారం మాసోస్తవ కార్యక్రమాన్ని నిర్వహించి గర్భిణీలు, బాలింతలు,కిషోర్ బాలికలకు అవగాహన కల్పించారు.నిత్యం మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు,కూరగాయలు,పండ్లు,గుడ్లు,మాంసకృతులు కలిగి ఉండేలా చూసుకోవాలన్నారు. పోషకాహార లోపం ఏర్పడితే రక్తహీనతకు దారితీస్తుందన్నారు.పసిపిల్లలకు ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే సరిపోతాయని ఆపై అదనపు ఆహారం ఇవ్వాలని సూచించారు.అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే రేషన్ కిట్టును సద్వినియోగం చేసుకోవాలన్నారు.గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట విరుద్ధమని భ్రూణ హత్యలకు పాల్పడితే పిసిపిఎన్డిటి చట్టం ప్రకారం జైలు శిక్ష జరిమానా విధించబడుతుందన్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామ సచివాలయ పరిధి అంగన్వాడి కేంద్రాలలో పౌష్టికాహార మాసొస్తవాలు నిర్వహించామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి గురు ప్రసాద్, హెల్త్ సూపర్వైజర్ నాగ శంకర్, సుశీలమ్మ,హెల్త్ ఎడ్యుకేటర్ సత్యనారాయణ,మహిళా పోలీస్ పార్వతి,ఎంఎల్ హెచ్ ఓ సుదమాధురి,నిర్మల,ఏఎన్ఎం వరలక్ష్మి,అంగన్వాడి సిబ్బంది మరియు బాలింతలు తదితరులు పాల్గొన్నారు.