పిఎంకెవివై ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి.

Praja Tejam
0

 జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

అనంతపురం, సెప్టెంబర్ 13 :ప్రజాతేజమ్


పిఎంకెవివై ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. శుక్రవారం నగరంలోని సాయి నగర్ లోని ఎన్ఎసి సెంటర్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పీఎంకేవీవై పథకం ద్వారా శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థినీ, విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడడం జరిగింది. మీకు ఉద్యోగం ఎక్కడ కావాలి, ఎంత జీతం కావాలి, ఉద్యోగం లోకల్ లో చేయగలరా, లోకల్ గా ఉద్యోగం దొరకని పక్షంలో  బయట బెంగుళూరు, హైదరాబాదు, చెన్నై వంటి నగరాలలో పనిచేయగలరా అని జిల్లా కలెక్టర్ అడిగారు. దీనికి సమాధానంగా వారు ఉద్యోగ అవకాశం కల్పిస్తే ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎలక్ట్రిషన్, ల్యాండ్ సర్వే శిక్షణ నందు మంచి నైపుణ్యం తెచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.  ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వీరికి ప్లేస్మెంట్ ఇప్పించాల్సిందిగా స్కిల్ డెవలప్మెంట్ అధికారులని, ఎన్ ఎ సి ఏడిలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఎన్ ఎ సి శిక్షణ తరగతులను, ల్యాబ్ ను, హాస్టల్ రూములను పరిశీలించారు. పక్కనే ఉన్న ఆర్ అండ్ బి కి  సంబంధించిన భవనాన్ని ఎన్ ఎ సికి ఇవ్వడానికి ఈ ఆఫీస్ ఫైల్ ను తయారుచేసి ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎ సి అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందరాజులు, స్కిల్ డెవలప్మెంట్ అధికారి రాజ్ కుమార్, అనంతపురం రూరల్ తహసీల్దార్ హరిబాబు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">