-- జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు
* ఏ.ఆర్ కానిస్టేబుల్ చంద్రానాయక్ మృతదేహాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ
* పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎస్పీ
* అన్ని బెన్ఫిట్స్ సకాలంలో అందజేయాలని ఆదేశాలు జారీ
* ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎస్పీ గారి చేతుల మీదుగా రూ. 25 వేలు అందజేత
పోలీసుశాఖ అండగా ఉంటుంది... ధైర్యంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు మృతి చెందిన ఏ.ఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి భరోసా కల్పించారు. నిన్నటి రోజున ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో విధుల్లో ఉన్న అనంతపురం జిల్లా ఏ.ఆర్ కానిస్టేబుల్ చంద్రనాయక్ (AR PC 3570 ) గుండె నొప్పితో చనిపోయారు. ఈయన మృతదేహాన్ని అనంతపురం తీసుకొచ్చారు. స్థానిక వీరనారమ్మ దేవాలయం సమీపంలో ఉన్న ఇంటి వద్ద సందర్శనార్థం ఉంచారు. చంద్రానాయక్ మృతదేహాన్ని జిల్లా ఎస్పీ గారు సందర్శించారు. పూలమాల వేసి నివాళులు అర్పించారు. మృతుడి భార్య అరుణ, కూతుళ్లు అంజలి, నందినిలను ఎస్పీ గారు పరామర్శించారు. ఆ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. ఆయనకు అందాల్సిన సాధారణ బెన్ఫిట్స్ తో పాటు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ప్రత్యేకంగా రూ. 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు నిన్న గౌరవ హోంశాఖామాత్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని బెన్ఫిట్స్ సకాలంలో అందజేయాలని ఎస్పీ గారు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ గారితో పాటు అనంతపురం రూరల్ డీఎస్పీ బి.వి.శివారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ మధు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్ , గాండ్ల హరినాథ్, పలువురు ఏ ఆర్ ఎస్ ఐ లు, బ్యాచిమేట్లు, బంధువులు, తదితరులు పాల్గొన్నారు.