ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లబ్ధిదారులకు ఇంటి తాళాలు, పత్రాలు

Praja Tejam
0

 


అందజేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వి, ఐఏఎస్

అనంతపురం, సెప్టెంబర్ 17 :

- అనంతపురం జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 పథకం క్రింద ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వి, ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద నిర్మించిన గృహాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. 

- అనంతపురంలోని కలెక్టరేట్ లోని ఎన్ఐసి భవనం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వి, ఐఏఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం కింద నిర్మించిన, కొత్తగా ప్రధాన మంత్రి అవాస్ యోజన కార్యక్రమం క్రింద 14 మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణ మంజూరు పత్రాలు పంపిణీ చేశామన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కార్యక్రమం 2.0 క్రింద కొత్తగా లబ్ధిదారులను గుర్తించి క్రొత్త ప్రతిపాదనలు విధివిధానాలను ప్రధానమంత్రి  వర్చువల్ గా విడుదల చేశారన్నారు. జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం క్రింద గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఇంటి తాళాలను లబ్ధిదారులకు కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శైలజ, అర్బన్ డీఈ కృష్ణారావు, కళ్యాణదుర్గం డిఈ విజయభాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">