దెబ్బతింటున్న చిన్నారుల కంటిచూపు

Praja Tejam
0

 Facebook


హైదరాబాద్ : ఎక్కువ సమయం సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లు చూస్తున్న చిన్నారులు, విద్యార్థుల శారీరక ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఐదేళ్లలోపు పిల్లలు తప్పనిసరిగా స్క్రీన్‌లను చూడటానికి తక్కువ సమయం కేటాయించాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ.హెచ్.ఓ) పేర్కొంది. స్మార్ట్‌ఫోన్ వాడకం కంటిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.  స్మార్ట్‌ఫోన్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల పిల్లలలో దృష్టి లోపం, పొడి కళ్ళు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. వారి కళ్లు సహజ రంగులను గుర్తించలేకపోతున్నాయి. వారికి మామిడి ఆకులు లేతపసుపు రంగులో కనిపిస్తున్నాయి. సూర్యరశ్మికి తట్టుకోలేక కళ్లను కిందకు వాల్చేస్తున్నారు. చిన్న వయసులోనే రెటీనా సమస్యలొస్తున్నాయి. ఇవి ఒక్కోసారి శస్త్రచికిత్సలకు దారితీస్తున్నాయి. నేత్రాలు దెబ్బతినడం, సహజ రంగులను గుర్తించకపోవడం వంటి సమస్యలు ఐదారేళ్లలో నాలుగైదు రెట్లు పెరిగాయని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు శివరామ్‌ మాలే చెబుతున్నారు. ఆయన ‘కలర్‌ విజన్‌ డెఫిషియెన్సీ’పై పరిశోధనలో భాగంగా కొన్ని నెలలపాటు వందలమంది పిల్లల డేటాను సేకరించారు. ‘రిషివ కలర్‌ ఇల్యూషన్‌ ప్రొటోటైప్‌’ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది ఇండియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ జర్నల్‌లో ఇటీవలే ప్రచురితమైంది. మనదేశంలోని మెట్రోనగరాల్లో ప్రతి ఐదుగురిలో ఇద్దరికి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఐదుగురిలో ఒకరికి ఈ లోపాలున్నాయని ఆయన అధ్యయనంలో తేలింది. పాఠశాలలు, కళాశాలల్లో గుర్తించేందుకు సరైన యంత్రాంగం లేకపోవడంతో సమస్య తీవ్రమయ్యాకే తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">