జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, I.A.S*
అనంతపురం, సెప్టెంబర్ 13:
జిల్లాలో నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున జరగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, I.A.S. ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ మీటింగ్ హాల్ లో జిల్లా నైపుణ్య కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ మిషన్ సామర్థ్యం పెంపుందేలా చూడాలని, శిక్షకులు మరియు ట్రైనీల శిక్షణను పెద్ద ఎత్తున జరిగేలా చూడాలన్నారు. సంకల్ప, పీఎం విశ్వకర్మ, తదితర కార్యక్రమాలనుపై చర్చించి జిల్లా నైపుణ్య అభివృద్ధికి ప్రణాళికను తయారు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానమంత్రి కౌశల్య వికాస యోజన పథకం(PMKVY), సంకల్ప ద్వారా ఎక్కువమందిని శిక్షణ ఇచ్చేటట్లు, సెంటర్లు పెంచే విధంగా చూడాలని తెలిపారు. దీనికి సంబంధించి నివేదికలు తయారు చేయాలని,శిక్షణ ఇచ్చిన తర్వాత వారికి కంపెనీలలో ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా జాబ్ మేళా నిర్వహించాలని తెలిపారు. ఈ జాబ్ మేళా నందు రీజనల్, జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనే విధంగా చూడాలన్నారు. ప్రతినెలా జాబ్ మేళా నిర్వహించేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. జాబ్ మేళా నిర్వహించుటకు ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చేవారంలో జాబ్ మేళా నిర్వహించాలని, నేను కూడా వచ్చి పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ఈ కమిటీలోని సభ్యులందరికీ అనంతపురం జిల్లా నుండి మంచి నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున జరగాలని, దానికి మొదటి అడుగుగా ఈరోజు నుంచి ప్రారంభం కావాలని, దీనికి అందరూ కృషి చేయాలని తెలిపారు. అంతేకాకుండా శిక్షణ సెంటర్ లను స్వయంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. కావున పరిశ్రమ శాఖ, జన శిక్ష సంస్థాన్, స్కిల్ ఫోక్స్ (ఇన్ హౌస్ ట్రైనింగ్) శిక్షణలు పెట్టాలని దీనికి సంబంధించి అనంతపూర్ 20 ఉన్నాయని జిల్లా జిల్లాస్థాయిలో వర్క్ షాప్ లు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో స్కిల్ డెవలప్మెంట్ అధికారి రాజ్ కుమార్, డీఆర్డీఏ పిడి ఓబులమ్మ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నాగరాజారావు, ఉపాధి కల్పన అధికారి కళ్యాణి, డిటిడబ్ల్యుఓ రామాంజనేయులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సారయ్య, పాలిటెక్నిక్, ఐటిఐ ప్రిన్సిపల్స్ తదితర అధికారులు పాల్గొన్నారు.