కుల్దీప్, అక్షర్ పటేల్‌కు నో ఛాన్స్.. తొలి టెస్ట్‌కు పాత వ్యూహంతో టీమిండియా!

Praja Tejam
0


 భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌కు రంగం సిద్దమైంది. భారత్ వేదికగా జరగనున్న ఈ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు సెప్టెంబర్ 19న తెరలేవనుంది.

45 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా మైదానంలోకి అడుగుపెట్టనుంది. చెన్నై వేదికగా తొలి టెస్ట్ జరగనుండగా.. ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.

టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఇదే తొలి టెస్ట్ సిరీస్ కావడం విశేషం. ఇప్పటికే చెన్నై చేరుకున్న భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. గంటల కొద్దీ నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు. పసికూన బంగ్లాదేశ్ అని తక్కువ అంచనా వేయకుండా అన్ని విధాలుగా సన్నదమవుతున్నారు.

పకడ్బందీ ప్రణాళికలు..

మరోవైపు గంభీర్ సారథ్యంలోని టీమిండియా మేనేజ్‌మెంట్ కూడా పకడ్బందీ ప్రణాళికలు రచిస్తోంది. తొలి టెస్ట్‌లో ఐదేళ్ల కిందటి ఓ పాత వ్యూహాన్ని అమలు చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో సొంతగడ్డపై టీమిండియా అనుసరించే ముగ్గురు స్పిన్నర్ల ఫార్మూలాకు స్వస్తీ చెప్పనుంది.

ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం చెన్నై వేదికగా జరిగే తొలి టెస్ట్‌కు రెడ్ సాయిల్ పిచ్ సిద్దం చేస్తున్నట్లు సమాచారం. సహజంగా చెన్నై వికెట్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే బంగ్లాదేశ్‌కు బ్లాక్ సాయిల్ పిచ్‌పై ఆడిన అనుభవం ఎక్కువ. స్వదేశంలో ఆ జట్టు ఎక్కువగా స్పిన్‌కు అనుకూలంగా ఉండే బ్లాక్ సాయిల్ పిచ్‌లపైనే ఆడుతోంది.

పేసర్లకు అనుకూలంగా..

ఈ క్రమంలోనే పేసర్లకు అనుకూలంగా ఉండే రెడ్ సాయిల్ పిచ్‌ను తొలి టెస్ట్ కోసం సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఈ మ్యాచ్‌ ఐదు రోజుల పాటు సాగేలా.. పిచ్‌పై గ్రాస్‌ను కూడా ఉంచుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా టీమిండియా ముగ్గురు పేసర్లతో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

స్పిన్నర్లకు బదులు పేసర్లతో బంగ్లాదేశ్‌ను బోల్తా కొట్టించాలనుకుంటున్నట్లు సమాచారం. 2019లో కోల్‌కతా వేదికగా జరిగిన పింక్‌ బాల్ టెస్ట్‌లో భారత్ ఇదే వ్యూహంతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో పేసర్లే ఎక్కువగా వికెట్లు తీసారు. మళ్లీ ఇదే వ్యూహాన్ని అమలు చేసి పై చేయి సాధించాలని టీమిండియా భావిస్తోంది.

అక్షర్, కుల్దీప్‌కు నో ఛాన్స్..

ఒకవేళ భారత్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌ బెంచ్‌కే పరిమితం కానున్నారు. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగనున్నారు. మూడో పేసర్‌గా యశ్ దయాల్, ఆకాశ్‌దీప్‌లో ఒకరికి అవకాశం దక్కవచ్చు. లెఫ్టార్మ్ పేసర్ అయిన యశ్ దయాల్‌కే తొలి ప్రాధాన్యత దక్కవచ్చు.

ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో ఆడాల్సి ఉంటుంది. లోకల్ భాయ్ అశ్విన్‌తో పాటు రవీంద్ర జడేజా బరిలోకి దిగనున్నారు. ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే జడేజాకు బదులు అక్షర్ పటేల్‌కు తుది జట్టులో చోటు దక్కవచ్చు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">