అనంతపురం, సెప్టెంబర్ 17 :
- తాడిపత్రి పట్టణంలోని పౌరసరఫరాల గోదామును మంగళవారం జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ గోదాము ఇంచార్జ్ స్టాకు వివరములు సంబంధించిన రిజిస్టర్లు ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలని, రిజిస్టర్ నందు నమోదు కాబడిన స్టాకు పరిమాణము మరియు గోదాము నందు నిల్వ ఉన్న స్టాకు పరిమాణము రెండు ఒకే విధంగా ఉండాలన్నారు. గోదాములో సీసీ కెమెరాలు నిత్యము పనిచేస్తూ ఉండాలని, గోదాము నందు ఎటువంటి సరుకు వృధాగా ఉండకూడదని, సరుకు రవాణా చేయునప్పుడు జరిగే వృధాను అరికట్టుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోదాము పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గోదాములో కొలతలు వేయు యంత్రములు సక్రమంగా పని చేయునట్లు చర్యలు తీసుకోవాలన్నారు. నిత్యవసరవస్తువుల సరుకులు పంపిణీ జరుగుటకు గోదాము నుండి F.P. షాపులకు సరుకులు నిర్ణీత సమయములో సరఫరా చేయవలెనన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ రమేష్ రెడ్డి, తహసీల్దార్ బాలాజీ మరియు ఇతరులు పాల్గొనడం జరిగింది.