అధికారులతో ముగిసిన కేంద్ర బృందం భేటీ

Praja Tejam
0

 Facebook



విజయవాడ : ఏపీఎస్డిఎంఎ కార్యాలయం లో బుధవారం దాదాపు రెండున్నర గంటల పాటు రాష్ట్ర అధికారులతో కేంద్ర బృందం సమావేశమయ్యింది. వరద సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం అహర్నిశలు పని చేసిన తీరును అధికారులు వివరించారు. వరద ప్రభావిత ప్రాంత బాధితులకు కోటికి పైగా ఆహార ప్యాకెట్స్‌, వాటర్‌ బాటిళ్లు పంపిణీ చేశామని అధికారులు తెలిపారు. వరద సహాయక చర్యల్లో భాగంగా బాధితులకు ఆహారం, తాగునీరు, పాలు, బిస్కెట్‌ ప్యాకెట్లు, క్యాండిల్స్‌, అగ్గిపెట్టెలు పంపిణీ చేశామన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మెడికల్‌ క్యాంపు లు ఏర్పాటు చేసి అత్యవసర వైద్య సాయం అందించామని వెల్లడించారు. వేలాది మంది ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ముంపు ప్రాంతాలు, సహాయక చర్యలను కేంద్ర బఅందానికి అధికారులు వివరించారు. విజయవాడ పురపాలక పరిధిలో దెబ్బతిన్న ప్రాంతాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ లో కేంద్ర బృందానికి అధికారులు చూపించారు. ఇళ్లలో దెబ్బతిన్న ఎలక్ట్రానిక్‌ పరికరాలు, వాహనాలు, గఅహోపకరణాలను


సిబ్బందితో మరమ్మతులు చేయిస్తున్నామని అన్నారు. వ్యవసాయం, రైతు సంక్షేమం డైరెక్టర్‌ డాక్టర్‌ ఎ.ఎల్‌. వాగ్మెర్‌ నేతఅత్వంలో నేడు బాపట్ల, గుంటూరు జిల్లాలో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలను, జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం స్వయంగా పరిశీలించనుంది. ఈ కేంద్ర బృందం సభ్యుల్లో అనిల్‌ సుబ్రహ్మణ్యం, కేంద్ర హోం వ్యవహారాల జాయింట్‌ సెక్రటరీ, డాక్టర్‌ ఎ.ఎల్‌.వాగ్మెర్‌, వ్యవసాయ రైతు సంక్షేమం, డైరెక్టర్‌, మహారాష్ట్ర, రాకేష్‌ కుమార్‌, రోడ్లు, రవాణా, హైవేస్‌ చీఫ్‌ ఇంజినీర్‌, విజయవాడ, ఆర్‌. బి. కౌల్‌, ఆర్థిక శాఖ కన్సల్టెంట్‌, న్యూ ఢిల్లీ, ప్రదీప్‌ కుమార్‌, గ్రామీణభివఅద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ, డాక్టర్‌ ఎస్‌.వి. ఎస్‌. పి.శర్మ, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌, ఇస్రో శాస్త్రవేత్త ఉన్నారు.

సంబంధిత వార్తలు

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">