జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్
అనంతపురం, సెప్టెంబర్ 14 ప్రజాతేజమ్ :
గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధిత చట్టంపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి శనివారం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలుపరిచే గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం( పి సి పి ఎన్ డి టి యాక్ట్ )అమలుకు సంబంధించి జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పి సి పి ఎన్ డి టి యాక్ట్ ప్రకారం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి స్కాన్ సెంటర్ యాక్ట్ ప్రకారం నిర్వహించే విధంగా వైద్య ఆరోగ్యశాఖ తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. ముఖ్యంగా స్కాన్ సెంటర్స్ నందు సెక్స్ డిటెక్షన్ జరగకుండా చూడాలన్నారు. స్కాన్ సెంటర్స్ లో పనిచేసే డాక్టర్స్ కు మరియు ఇతర సిబ్బందికి పి సి పి ఎన్ డి టి యాక్ట్ కు సంబంధించి పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూడాలన్నారు. అంతే కాకుండా కేజీబీవీ, గురుకుల బాలికల పాఠశాలల్లో, డి ఎం హెచ్ ఓ, ఐ సి డి ఎస్, ఎన్జీవోలతో కలిసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని తెలిపారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఒక పి పి టి ని తయారు చేసి ప్రతి బాలికల పాఠశాలలందు అవగాహన కల్పించే విధంగా ప్రణాళిక తయారుచేసి అమలు ఏ విధంగా చూడాలన్నారు. అలాగే సిబ్బందికి మరీ ఉపాధ్యాయులు కూడా అవగాహన కల్పించాలన్నారు. గర్భస్థలింగం చట్టం యొక్క పరిధిని అనంతపురం జిల్లా నందు ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా అవగాహన కార్యక్రమాలు, హోర్డింగులు రైల్వే స్టేషన్స్, బస్టాండ్ లు, సినిమా హాల్స్, మొదలగు పబ్లిక్ ప్రాంతాల్లో ఈ చట్టంపైన అవగాహన కలిగించాలన్నారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై తగిన చట్టగపరమైన చర్యలు ఉంటాయని తెలియజేయాలన్నారు.
శ్రీమతి రాజ్యలక్ష్మి గారు స్పెషల్ జడ్జి POCSO, ఫోక్స కేజీబీవీ మరియు హై స్కూల్స్ నందు తప్పనిసరిగా ప్రతి విద్యార్థికి గర్భస్థ పిండ లింగ నిషేధిత చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. ఆడైనా మగైనా ఒకటే అను విషయాన్ని ప్రజలందరూ కూడా అవగాహన కల్పించాలన్నారు. గర్భిణీ స్త్రీలకు స్కాన్ మిషన్స్ ద్వారా కడుపులో పెరుగుతున్న బిడ్డ యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడాని తప్ప కడుపులో పెరుగుతున్నది ఆడ మగ అని తెలుసుకోవడానికి కాదని అవగాహన కల్పించాలన్నారు. ఏ స్కానింగ్ సెంటర్లో అయినా సెక్స్ డిటెక్షన్ జరిగినట్లు నిర్ధారణ అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఆడపిల్ల యొక్క ప్రాముఖ్యతను ప్రజలందరికీ తెలియజేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఈ బి దేవి, ఆర్డిటి సంస్థ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ దుర్గేశ్ ,H O D శ్రీ వ్యాధి నిపుణులు డాక్టర్ శంషాద్ బేగం, డాక్టర్ పార్వతి ,అనంతపురం పట్టణ డివిజనల్ పోలీస్ అధికారి అలాగే రెడ్స్ సంస్థ డైరెక్టర్ భానుజ ,మాస్ మీడియా అధికారి త్యాగరాజు , గంగాధర్ వేణుగోపాల్ ,లీగల్ అడ్వైజర్ ఆషారాణి, వెంకటేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.