పేదల కడుపునకు అన్నం పెట్టాలన్నదే మా లక్ష్యం..
- : అన్న క్యాంటీన్లను ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
అనంతపురం, సెప్టెంబర్ 19 :
- పేదల కడుపునకు అన్నం అందాలని..ఆ రోజు ఎన్టీఆర్ తపించారని.. ఆ లక్ష్యానికి అనుగుణంగానే తమ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం రాత్రి అనంతపురం నగరంలో అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హాజరయ్యారు. నగరంలోని ఓల్డ్ టౌన్ లోని గుత్తి రోడ్డులో ఒక అన్న క్యాంటీన్ మొదటి ప్రారంభించగా, ఆ తర్వాత రైల్వే స్టేషన్ వద్ద ఒక అన్న క్యాంటీన్, బళ్లారి బైపాస్ లో మరో క్యాంటీన్ ప్రారంభించారు. క్యాంటీన్ లో చిన్నారులకు ఎమ్మెల్యే దగ్గుపాటి భోజనం తినిపించారు.
- ఈ సందర్భంగా ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఆ రోజు పేదలకు ఎన్టీఆర్ కూడు, గుడ్డ, నీడ అందించాలని తపించారని.. అందులో భాగంగానే 2014-19 సమయంలో చంద్రబాబు అన్న క్యాంటీన్లను తీసుకొచ్చారన్నారు. అయితే ఆ క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసి వేయించిందన్నారు. పేదలకు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఆగష్టు 15 నుంచి దశల వారిగా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామని.. దశల వారిగా వీటిని విస్తరిస్తామన్నారు. ఎమ్మెల్యే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే తాము అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని చెప్పామని.. ఇచ్చిన హామీని నెరవేరస్తూ మూడు క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. గతంలో అనంతపురం నగరానికి వచ్చే పేదలకు, కూలీలు, యాచకులకు అన్న క్యాంటీన్లు తక్కువ ధరకే అన్నం పెట్టాయని.. కానీ గత ప్రభుత్వంలో నిర్దాక్షణ్యంగా వీటిని మూసివేశారని మండిపడ్డారు. ఇప్పుడు అన్న క్యాంటీన్లు ప్రారంభించడంపై ఎంతో మంది హర్షం వ్యక్తం చేస్తున్నారని.. రానున్న రోజుల్లో మరిన్ని క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శులు ఆదినారాయణ, రాయల్ మురళి, టిడిపి రాష్ట్ర నాయకులు సుధాకర్ నాయుడు, గంగారామ్, మాజీ మేయర్ మదమంచి స్వరూప, జనసేన వీర మహిళ రాయలసీమ అధ్యక్షురాలు పెండ్యాల శ్రీలత, బిజెపి రాష్ట్ర కార్యదర్శి లలిత్ కుమార్, తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వప్న, టిడిపి జిల్లా ఉపాధ్యక్షడు డిష్ నాగరాజు, జిల్లా అధికార ప్రతినిధి సరిపూటి రమణ, బిసి సెల్ నగర అధ్యక్షుడు సిమెంట్ పోలన్న, మాజీ కార్పొరేటర్లు రంగాచారి, రాజారావు, కార్పొరేటర్ శ్రీలక్ష్మి, తెలుగుదేశం పార్టీ నాయకులు రాయల్ మధు, గోళ్ళ సుధాకర్ నాయుడు, తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని, మాజీ జెడ్పీ చైర్మన్ చమన్ సాబ్ తనయుడు ఉమర్, తెలుగు మహిళ నాయకురాలు వడ్డే భవాని, మైనార్టీ నాయకులు తాజుద్దీన్, సైఫుద్దీన్, కృష్ణం రఘు, తాటి మధు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.