శ్రీశైలం దేవస్థానానికి అరుదైన రికార్డు.. లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం..

Praja Tejam
0


 నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న దేవస్థానం మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. శ్రీశైలం ఆలయం విస్తీర్ణం, ఆలయంలోని నంది విగ్రహానికి ఆలయ నిర్వాహణకు ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు లండన్ సంస్థలో స్థానం సంపాదించుకుంది.

ముఖ్యంగా పురాతన సంపద పరంగా, ఆధ్యాత్మికంగా, సాంస్కృతి సంప్రదాయాలు, ఆధ్యాత్మిక సత్యం అత్యున్నత భాండాగారంతో కూడిన విలువలు గల సజీవ స్వరూపంగా పౌరాణిక ప్రాముఖ్యత కలిగి ఉన్నందుకు ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో శ్రీశైల ఆలయం నమోదు కాబడింది. దీంతో శ్రీశైలం దేవస్థానానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ధ్రువీకరణ పత్రం వరించింది.

లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ విభాగపు సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ ఉల్లాజి ఇలియాజర్ ధ్రువీకరణపత్రాన్ని అందజేశారు. శ్రీశైలక్షేత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, ప్రధానాలయ విస్తీర్ణం, ప్రధానాలయం చుట్టూ ఉన్న అరుదైన శిల్పప్రాకారం, క్షేత్రంలోని ప్రాచీన కట్టడాలు తదితర అంశాల ఆధారంగా శ్రీశైల ఆలయాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సు జాబితాలో చేర్చినట్లుగా ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ధ్రువీకరణ పత్రాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి,ఆలయ ఈవో పెద్దిరాజుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాయింట్ సెక్రెటరీ ఉల్లాజీ ఎలియజర్ అందజేశారు.

పరిపాలనా కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ఈ ధ్రువీకరణపత్రం అందజేత కార్యక్రమానికి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో శ్రీశైల క్షేత్రానికి చోటు లభించడం సంతోషం కలిగిస్తుందన్నారు. అయితే గతంలోనూ దేవస్థానంలో 7 విభాగాలకు ఐ.ఎస్.ఓ ద్వారా ధ్రువీకరణ పత్రలను అందుకున్న శ్రీశైలం మల్లన్న ఆలయం సొంతం చేసుకుంది.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">