రెడ్డికే పగ్గాలు? ఏపీపై బీజేపీ భారీ స్కెచ్‌.

Praja Tejam
0


 ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే బీజేపీకి రెడ్డి సామాజికవర్గం నాయకత్వం వహించేది.

దక్షిణ భారత్‌లో బలం పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీ… ఏపీలో తన పునాదులు గట్టి చేసుకోవాలని చూస్తోందా? టీడీపీ, జనసేనతో పొత్తుపెట్టుకుని.. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించినా.. సొంత బలం ఇంకా పెరగాలని భావిస్తోందా? ఓ కీలక సామాజిక వర్గంపై ఫోకస్‌ చేసి.. ఆ కులానికి చెందిన నేతలకు గాలం వేయాలని అనుకుంటోందా? అందుకోసం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాయలసీమకు చెందిన ఓ కీలక నేతకు బాధ్యతలు అప్పగించబోతోందా? కమల నాథుల వ్యూహమేంటి? ఏపీపై ఆ పార్టీ స్కెచ్‌ ఏంటి?

ఏపీ ప్రభుత్వ భాగస్వామి బీజేపీ… భవిష్యత్‌ రాజకీయాలకు పక్కా స్కెచ్‌ వేస్తోంది. రాష్ట్రంలో బలపడాలని ఆశిస్తున్న కమలనాథులు… కీలకమైన రెడ్డి సామాజికవర్గంపై ఫోకస్‌ చేశారంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ముద్ర వేయాలంటే రెడ్డిల మద్దతు అవసరమని భావిస్తున్న కాషాయదళం… మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని రంగంలోకి దింపాలని చూస్తోందని టాక్‌ వినిపిస్తోంది. రాయలసీమకు చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి.

రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు రాజకీయాలకు కాస్త దూరంగా వ్యవహరిస్తూ వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి… పార్లమెంట్‌ ఎన్నికల ముందు బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. రాజంపేట నుంచి లోక్‌సభకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఒకవేళ ఆయన గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యేవారని… కానీ, ఫలితం వేరేలా వచ్చినందున ఆయన సేవలను పార్టీకి వాడుకోవాలని చూస్తున్నారని చెబుతున్నారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు?

ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్న పురందేశ్వరి స్థానంలో కిరణ్‌కుమార్‌రెడ్డికి ఏపీ బీజేపీ చీఫ్‌ బాధ్యతలు అప్పగించాలని కలమనాథులు ప్లాన్‌ చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పురందేశ్వరి పదవీకాలం త్వరలో పూర్తికానుండటం… ప్రస్తుతం ఆమె ఎంపీగా ఉండటం వల్ల ప్రత్యామ్నాయంగా కిరణ్‌కుమార్‌రెడ్డికి అవకాశమివ్వాలని చూస్తున్నారని అంటున్నారు. పైగా కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత సామాజికవర్గాన్ని ఆకట్టుకోవాలని ఇప్పటికే ప్లాన్‌ చేస్తున్న బీజేపీ… కిరణ్‌కు ఇష్టం లేకపోయినా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే పట్టుదల ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">