అనంతపురం, సెప్టెంబర్ 15
- : రూ.2,01,000 ల చెక్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేసిన ఎంపీ
- *విజయవాడ వరద బాధితులకు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అండగా నిలిచారు. విజయవాడ వరద భాదితుల సహాయార్థం రూ.2,01,000 లను అందజేయగా, అందుకు సంబంధించిన చెక్ ను ఆదివారం హైదరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నివాసంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి ఎంపీ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వరద బాధితులకు తమ వంతు సాయంగా 2 లక్షల 1,000 రూపాయలను అందజేయడం జరిగిందని ఎంపీ తెలిపారు. ఇందుకు సంబంధించిన చెక్ ను రాష్ట్ర ముఖ్యమంత్రికి అందజేశామన్నారు. తమ కూటమి ప్రభుత్వం వరద బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తనయుడు అంబికా వీక్షిత్ పాల్గొన్నార