అనంతపురం రేడియో స్టేషన్ లో ఆకాశవాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని పంట సాగుదారు హక్కు పత్రం అంశంపై రైతులకు సూచనలు, సలహాలు అందజేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, I.A.S
అనంతపురం, సెప్టెంబర్ 12:ప్రజాతేజమ్
అనంతపురం రేడియో స్టేషన్ లో గురువారం ఉదయం 7:45 గంటల నుంచి 8:15 గంటల వరకు ఆకాశవాణి ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని పంట సాగుదారు హక్కు పత్రం అంశంపై వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, I.A.S రైతులకు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కౌలు రైతును అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల రైతుల నుండి ఫోన్ కాల్స్ స్వీకరించి వారి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా జిల్లా కలెక్టర్ రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాప్తాడు మండలం నుండి ఈరస్వామి మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాలో అనావృష్టి ఎక్కువగా ఉంటుందని, పంట నష్టపరిహారాన్ని సబ్సిడీ, ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉన్నాయా తెలపగలరు అని కోరారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ సమాధానం ఇస్తూ.. కౌలు రైతులకు సంబంధించిన అగ్రిమెంట్ ను గ్రామ రెవెన్యూ అధికారుల నుండి కౌంటర్ సిగ్నేచర్ పొంది ఉండాలని, ఎన్ని ఎకరాలు చేసుకుంటున్నారు, భూమి హక్కుదారు ఎవరు, తదితర సంబంధిత డాక్యుమెంట్లు పూర్తిస్థాయిలో నివేదికలు తెలిపి ఉన్నట్లయితే పంట రుణాలు కావచ్చు, ప్రభుత్వం అందించే ఉచిత బీమా కానీ, ఇన్ పుట్ సబ్సిడీ, వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించి పంట నష్టం, ప్రకృతి వైపరీత్యం సంబంధించి ప్రభుత్వం నుండి అందే ప్రతి ఒక్కటి మీకు అందుతాయని తెలిపారు. ఇలాంటివి జరగకూడదని ఆ దేవున్ని నేను కూడా కోరుతున్నానని తెలిపారు. అలా జరిగిన గ్రామ, మండల అగ్రికల్చర్ అధికారులు వారు పరిశీలించి నివేదికలను పంపుతారని, తద్వారా మీకు ప్రభుత్వం నుండి అందే సహాయాన్ని అందజేయడం జరుగుతుందని తెలిపారు.
రైతు పుల్లన్న ఆత్మకూరు మండలం నుండి చుక్కల భూమికి సంబంధించి సమస్యలను పరిష్కారమయ్యేటట్టు చూడాలని కోరారు. జిల్లా కలెక్టర్ గారు స్పందిస్తూ.. చుక్కల భూమికి సంబంధించి రెవెన్యూ వారు రిజిస్ట్రేషన్ వారు ఎంక్వైరీ నిర్వహించడం జరుగుతుందని, ఇది త్వరలోనే పూర్తి అవుతుందని, సంబంధిత నివేదిక వచ్చిన తర్వాత దానికి సంబంధించి జాయింట్ కలెక్టర్ చుక్కల భూమికి సంబంధించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. దీనికి సంబంధించిన అర్జీలను మీరు పంపించి ఉంటే ఆర్జీలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
యాడికి నుండి వెంకటరమణ మాట్లాడుతూ పీఎం ముద్రా లోన్ గురించి మీకు దగ్గరగా ఉన్న బ్యాంకుకు అధికారులకు సంప్రదించాలని, అక్కడ మీకు సరైన సమాధానం లభించకపోతే ఎల్ డి ఎం నర్సింగరావు ఫోన్ ద్వారా గాని నేరుగా గాని సంప్రదిస్తే పీఎం ముద్ర లోన్ గురించి మీకు అవగాహన కల్పించడం జరుగుతుందని, దీనికి సంబంధించి ఫోన్ నెంబర్ ను మరియు మెయిల్ ఐడి ఈ కార్యక్రమం అయిన తర్వాత చివర్లో మీకు తెలపడం జరుగుతుందని తెలిపారు. ఈమధ్య జరిగిన కలెక్టర్ల సదస్సులో త్వరలోనే ప్రభుత్వ పథకాలను అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలియజేశారు. ఈ సందర్భంగా మీకు తెలియజేయడమేమంటే కౌలు రైతులకు సంబంధించి భూమి మీద పంట నష్టం కౌలు రైతుకే వచ్చేటట్టు చూడడమే దీని ముఖ్య ఉద్దేశ్యం అన్నారు, ఈ కొత్త చట్టంలో ఉందని తెలిపారు.
రైతు పోలేరయ్య, అనంతపురం రూరల్ మండలం నుండి కౌలు రైతులకు సంబంధించి ఖరీఫ్ పంటలకు కాకుండా ఉద్యానవన పంటల లైన మామిడి, సపోటా, చీని వంటి పంటలకు కూడా వస్తాయా అని అడిగారు. దీనికి సంబంధించి భూమికల రైతు నుండి మీరు అగ్రిమెంట్ చేసుకునే రోజు నుండి 11 నెలల వరకు వర్తిస్తుందని, అంటే ఖరీఫ్ రబీ రెండు పంటలకు కూడా వర్తించే విధంగా ఉంటాయని, అలాగే 11 నెలలైనా తరువాత కూడా మీరు దానిని రెన్యువల్ చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. పంటపై జరిగే ఎలాంటి నష్టం అయినా కౌలు రైతులకు చెందే విధంగా ఉంటుందన్నారు. భూమి హక్కు దారుని పేరు ఉన్న పంట నష్టం మాత్రం కౌలు రైతుకు చెందే విధంగా ఉంటుందని అగ్రిమెంట్ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు.
నరేష్ బాబు, ధర్మవరం కేతిరెడ్డి కాలనీ నుండి చేనేత రంగానికి సంబంధించి 50 మగ్గాలు ఉంటే గాని సబ్సిడీ రావడం లేదని కుటుంబాలలో ఒకటి లేదా రెండు మగ్గాలు మాత్రమే ఉంటాయని, అలాంటి వారి కూడా సబ్సిడీ ఏమైనా వర్తిస్తుందా తెలియజేయాలన్నారు. ఈరోజు పంట సాగు హక్కు పత్రం గురించి మాత్రమే మాట్లాడాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, మీ యొక్క ఫోన్ నెంబర్ మీ అడ్రస్సును నమోదు చేయడం జరుగుతుందని, దీనికి సంబంధించిన విధి విధానాలు వచ్చిన తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
రామచంద్రుడు, రాప్తాడు మండలం నుండి దేవాదాయ శాఖ సంబంధించిన భూములను కౌలుకు తీసుకున్నామని, బ్యాంకు రుణము మరియు సబ్సిడీలు ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా తెలియజేయాలని కోరారు. ఇందుకుగాను దేవదాయ శాఖ భూమి కానీ, ప్రైవేటు భూమి కానీ రెండు ఒకే విధంగా చూడడం జరుగుతుందని, పంటరుణం, పంట బీమా, సబ్సిడీ అన్ని కూడా అందుబాటులో ఉంటాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. దేవాదాయ భూములు చాలా ఎక్కువగా ఉంటాయని దానిలో మీరు ఎంత భూమి ఎంత కౌలు చేస్తున్నది, ఎన్ని ఎకరాలు చేస్తున్నది, మీకు ఇచ్చే కార్డు నందు నమోదు కాబడి ఉంటుందని, మీకు ఇచ్చే గ్రామ రెవెన్యూ అధికారి నుండి నివేదికలో పొందుపరిచి ఉంటుందని తెలిపారు. దీనికి సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి మరియు అగ్రికల్చర్ అధికారులను కలిసి వివరాలను తెలపాలని, తద్వారా వారు ప్రభుత్వం నుండి అందే సహాయ సహకారాలన్నీ అందిస్తారని తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా రైతులకు మన జిల్లాలో ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి హార్టికల్చర్ చాలా బాగుంటుందని, హార్టికల్చర్ పైపు వెళ్లేందుకు మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా అనంతపురం జిల్లా నందు రైతులు పొలం చుట్టూ బౌండరీ ప్లాంటేషన్ వేసే విధంగా టేకు చెట్లను పెంచే కార్యక్రమాన్ని చేపట్టే విధంగా చూడాలని, ఈ చెట్లు నాటడం వలన 20 నుండి 25 సంవత్సరాలకు ఈ పంట వస్తుందని, తద్వారా అధిక లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ అవకాశాన్ని ప్రతి రైతు ఉపయోగించుకోవాలని తెలియజేశారు. టేకు చెట్ల పెంపకానికి రైతులు ముందుకొస్తే ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా చెట్లను కూడా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలు రకాల భూ సమస్యలపై కొందరు మాట్లాడడం జరిగిందని, దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ భూ సమస్యలకు సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, దీనికి సంబంధించి మీ సమస్యలు ఫోన్ నెంబర్ 8500292992 మరియు cccantp@gmail.com కు వాట్సాప్ గాని, మెసేజ్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా తెలిపితే ఆ సమస్యను అధికారులతో సంప్రదించి సమస్య పరిష్కరించే విధంగా చూస్తామన్నారు.
బ్యాంకు నుండి లోన్లకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే ఎల్.డి.ఎం నర్సింగరావు ఫోన్ నెంబర్ 9440905431కు ఫోన్ ద్వారా సంప్రదించి ఈ సమస్యను తెలిపినట్లైతే మీ సంబంధిత ప్రాంతంలోని మేనేజర్లకు మాట్లాడి మీ సమస్యను పరిష్కరించే విధంగా సహకరిస్తారని తెలిపారు.
అనంతరం ఆల్ ఇండియా రేడియో స్టేషన్ అనంతపురం లోని కార్యాలయము , కంట్రోల్ రూమ్, లైబ్రరీ, ప్రసార విభాగాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి నరసింహారావు, ఏడి ఫిరోజ్ ఖాన్, ఎల్ డి ఎం నర్సింగరావు, పట్టు పరిశ్రమశాఖ, పశుసంవర్ధక శాఖ, తదితర సిబ్బంది పాల్గొనడం జరిగింది.