ఓనం వీకెండ్‎లో ఓటీటీ జాతర.. రెండు బ్లాక్ బస్టర్‎లు.. ‎సిరీస్‎లు..

Praja Tejam
0

 ఫీల్-గుడ్ తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం ఆయ్. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ మూవీ ఆగష్టు 16న విడుదలైంది. చిన్న గా వచ్చి బ్లాక్ బస్టర్ అయింది.

ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

   


 రీసెంట్‎గా మెగా డాటర్ నిహారిక నిర్మించిన తెలుగు కామెడీ, ఎమోషనల్ చిత్రం కమిటీ కుర్రాళ్లు. ఈ ద్వారా 11 మంది నటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆగస్టు 9న చిన్న గా విడుదలై ప్రేక్షకుల ప్రశంసలతో బ్లాక్ బస్టర్‎గా నిలిచింది. ఇది సెప్టెంబర్ 13 నుంచి ఈటీవీ విన్ వేదికగా ప్రసారం కానుంది.

       స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న థియేటర్లలో విడుదలైన యాక్షన్ ఎంటర్టైనర్ మిస్టర్ బచ్చన్. రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీతో భాగ్యశ్రీ బోర్సే కథానాయకిగా పరిచయం అయింది. ఇప్పుడీ సోనీలివ్ వేదికగా సెప్టెంబర్ 13న ఓటీటీలో విడుదల కానుంది.

        బెంచ్ లైఫ్ అనేది కార్పొరేట్ సంస్కృతి నేపథ్యంలో రూపొందిన తెలుగు వెబ్ సిరీస్. మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైభవ్ రెడ్డి, చరణ్ పేరి. రితికా సింగ్ నటించారు. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య భూమిక పోషించారు. ఈ సిరీస్ సోనీలివ్‎లో సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

          సెక్టార్ 36 అనేది బోధయన్ రాయ్‌చౌదరి రాసిన ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహించిన భారతీయ హిందీ భాషా క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. ఇది 2006 నోయిడా సీరియల్ మర్డర్స్‌ ఆధారంగా తెరకెక్కినది. దీనిని నిథారీ కిల్లింగ్స్ అని కూడా పిలుస్తారు. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌ వేదిక సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">