నిద్ర వీడరు.. మురుగు చూడరు!

Praja Tejam
0

 


నంత నగర నడిబొడ్డున సప్తగిరి కూడలి వద్ద మురుగులోనే రాకపోకలు

నగరపాలక యంత్రాంగం మొద్దు నిద్ర వీడటం లేదు. ఫలితంగా మురుగు ప్రవాహం రోడ్డు మీద పరుగు పెడుతోంది.

ఉమ్మడి జిల్లాలోనే ఎక్కువ జనాభా (మూడు లక్షల మంది) ఉన్న అనంతపురంలో పారిశుద్ధ్యం దయనీయంగా మారింది. నగరంలో పారిశుద్ధ్యం తీరుపై జిల్లా కలెక్టరు వినోద్‌కుమార్‌ సమీక్ష నిర్వహించి.. ఆగ్రహం వ్యక్తం చేసినా నిర్లక్ష్యం వీడ లేదు. నగరం నడిబొడ్డున నగరపాలక కార్యాలయం సమీపంలోనే మురుగు రోడ్డు మీద వరదలా ప్రవహిస్తున్నా పట్టించుకునేనాథుడే లేడు. రోజంతా అలాగే వదిలేశారు. రద్దీగా ఉండే ప్రదేశం కావడం, అక్కడ కాలువ అధ్వానంగా ఉండటంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాలువలో ఏదైనా అడ్డంగా పడి ఉంటే దాన్ని తొలగిస్తే మురుగు ముందుకు వెళ్లే అవకాశం ఉన్నా చూసీచూడనట్టు వ్యవహరించారు. పలు ప్రాంతాల నుంచి నగరంలోకి ప్రవేశించే బళ్లారి బైపాస్‌లోనూ మురుగు స్వాగతం పలుకుతోంది. పెద్ద కాలువ నిండి రోడ్డు మీదకు మురుగు వస్తోందంటే.. అసలు పారిశుద్ధ్య విభాగం ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

న్యూస్‌టుడే, అనంత నగరపాలక

బళ్లారి బైపాస్‌లో మురుగు కాలువ నిండి రహదారిపై ప్రవాహం ఇలా..

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">