చనిపోవడం మనిషి జీవితంలో ముఖ్యమైన ఆఖరి భాగం. కానీ, చనిపోయే క్షణంలో మెదడులో ఏం జరుగుతుందో మనకు దాదాపు తెలియదని అర్ధమయ్యాక న్యూరో సైంటిస్ట్ జిమో బోర్జిగిన్ ఆశ్చర్యపోయారు. ఈ వాస్తవం ఆమెకు చాలా యాదృచ్ఛికంగా సుమారు ఒక దశాబ్దం కిందట తెలిసింది. "అప్పుడు ఎలుకలపై ప్రయోగాలు చేస్తున్నాం. శస్త్రచికిత్స తర్వాత మేం వాటి మెదడులోని న్యూరోకెమికల్ స్రావాలను పరిశీలిస్తున్నాం." అని ఆమె బీబీసీకి వివరించారు. హఠాత్తుగా, వాటిలో రెండు ఎలుకలు చనిపోయాయి. దాంతో ఆమె వాటి మెదడులో జరిగే మరణ ప్రక్రియను గమనించడం సాధ్యమైంది. "ఒక ఎలుకలో సెరోటోనిన్ చాలా ఎక్కువగా స్రవించిందని తెలిసింది. ఆ ఎలుకలో ఏవైనా మానసిక భ్రాంతులు కలిగాయా?” అని తాను ఆశ్చర్యపోయినట్లు ఆమె తెలిపారు. సెరోటోనిన్‌కు భ్రాంతితో సంబంధం ఉంటుందని ఆమె వివరించారు.
చనిపోతున్నప్పుడు మనిషి మెదడులో ఏం జరుగుతుంది?
September 10, 2024
0

Tags