ముంపు బాధతుల ఆందోళన – అధికారుల హామీతో విరమణ

Praja Tejam
0

 Facebook


వాంబే కాలనీ (విజయవాడ) : ఫైర్‌ ఇంజన్ల ద్వారా ఇండ్లను శుభ్రం చేయించాలని, వ్యర్ధాలు తొలగించాలని డిమాండ్‌ చేస్తూ …. బుధవారం విజయవాడ వాంబే కాలనీ డీ బ్లాక్‌ లో స్థానికులు ఆందోళన చేపట్టారు. తామంతా వరద ముంపులో బాధపడ్డాని, తమ ఇండ్లు, సామాగ్రి బురదపట్టాయని, ఎక్కడికక్కడ వ్యర్థాలు దుర్గంధం వస్తున్నాయని బాధితులంతా వాపోయారు. గత నాలుగు రోజులుగా ఇదిగో, అదిగో అంటున్న అధికారులు కాలయాపన చేస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రోడ్డుపై బాధితులు బైఠాయించడంతో వారికి మద్దతుగా స్థానిక సిపిఎం, ప్రజాసంఘాల నేతలు ఎస్కే. పీర్‌ సాహెబ్‌, అప్పన్న, తదితరులు నిలిచారు. ప్రజల ఆందోళనతో అధికారులు దిగివచ్చి, తక్షణమే పనులు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళనను విరమించారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">