తాడిపత్రి (యల్లనూరు) ప్రజాతేజమ్ : యల్లనూరు స్థానిక మండల కేంద్రంలో వైసీపీ వర్గానికి చెందిన దాసరి రమణ, టిడిపి వర్గానికి చెందిన మాజీ సర్పంచ్ కొత్తమిద్దె ఓబులేసు ఇరువర్గాల మధ్య బుధవారం ఘర్షణ జరిగింది. పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు ఘర్షణలో దామోదర్, వీరనారప్ప కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందడంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దాడి చేసిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు …. ఇలా గత ఇరవై రోజుల క్రితం కుటుంబ కలహాలతో కటిక ముని ఇంటి పై దాడి జరిగిందన్నారు. అది కాస్త చిరిగి చిరిగి రెండు వర్గాలకు రాజుకోవడంతో వైసీపీ వర్గానికి చెందిన రాము, రమణారెడ్డి టిడిపి వర్గానికి చెందిన దామోదర్, వీరనారప్ప లు మధ్య పరస్పర దాడులు జరిగాయని.. ఈ నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువురి పై కేసులు నమోదు చేశారని తెలిపారు. అప్పటి నుండి ఎవరికివారు ఎదురు పడితే చాలు దాడులు చేసుకొనే స్థాయికి దిగారని అన్నారు. అందులో భాగంగా గత పది రోజుల క్రితం టిడిపి వర్గానికి చెందిన దామోదర్ ను కొందరు వెంబడించారని, ఈ విషయం సి ఐ సుబ్రహ్మణ్యంకు తెలిపామని ఇది ప్రతీకార చర్యగా ఉందని బాధిత కుటుంబాలు తెలిపాయి.
టిడిపి-వైసిపి వర్గీయుల ఘర్షణ – ఇద్దరికి తీవ్రగాయాలు
September 11, 2024
0

Tags