నెమలి ఈకను చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. కొందరు దేవుళ్ళ గదిలో పెట్టి పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇంకొందరు ఇంటి అలంకరణ కోసం ప్రతి ఒక గదిలో ఈ నెమలి ఈకలను అమర్చుతూ ఉంటారు.అయితే, ఒక సాధారణ నెమలి ఈకలు చాలా దోషాలను తొలగించగలవని, అలాఎలా మీ ఇంటి యొక్క వాస్తుకు మంచిదని మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. నెమలి ఈకతో మీరు కొన్ని రకాల దోషాలను తొలగించుకోవచ్చు అని చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అందుకోసం మీరు ఎనిమిది నెమలి ఈకలను ఉపయోగించాలి.
వాటన్నింటినీ తీసుకొని దగ్గరగా కలిపి వాటి దిగు బాగాన ఒక తెల్లటి దారంతో కట్టాలి. తర్వాత మీరు ఓం సోమయే నమః అనే మంత్రాన్ని జపించాలి. శని దోష నివారణ కోసం నల్లటి దారంతో మూడు నెలలు ఈకలను కలిపి కట్టి తాంబూలంలో వాడే నెమలి చుక్కలను ఉంచి వాటిపై నీళ్లు చల్లుతూ ఈ మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఇంతకీ ఆ మంత్రం ఏమిటంటే ఓం శనీశ్వరాయ నమః. అదేవిధంగా మీరు డబ్బులు ఎక్కడైతే ఉంచుకుంటారో ఆ లాఖరు సమీపంలో ఒక నెమలి ఈకను ఉంచాలట. నెమలి ఈక సంపదని ఆకర్షించి, స్థిరత్వాన్ని సిద్ధింపజేస్తుందని పండితులు చెబుతున్నారు.
నెమలి కూడా అందంతో సంబంధమును కలిగి ఉంటుంది. నృత్యం చేస్తున్నట్లుగా ఉన్న నెమలి పెయింటింగ్ను మీ లివింగ్ రూమ్లో ఉంచినట్లయితే, మీ గదిలో అందమును, శోభను, ఆకర్షణను కలగజేస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నట్లయితే వాస్తు దోషాలు తొలగించుకోవాలి అనుకున్న వారు, మీ ఇంటి ప్రవేశద్వారం వద్ద కొన్ని నెమలి ఈకలను ఉంచాలి. ఇలా చేస్తే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించదు. అలాగే ఇంట్లో ఉండే ప్రతి కూల శక్తులు కూడా పారిపోతాయట.