శ్రీరామ్ రెడ్డి త్రాగునీటి పథకంలో మరియు శ్రీ సత్యసాయి వాటర్ సప్లై  వర్కర్లు సమ్మె విరమణ

Praja Tejam
0

 


జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

అనంతపురం, సెప్టెంబర్  17: ప్రజాతేజమ్

నీలకంఠాపురం శ్రీరామ్ రెడ్డి త్రాగునీటి పథకంలో మరియు శ్రీ సత్య సాయి, వాటర్ సప్లై వర్కర్స్ తో చర్చించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని సమ్మె విడమింపజేయాలని  

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సూచించారు.

మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నీలకంఠాపురం శ్రీరామ్ రెడ్డి త్రాగునీటి పథకంలో వాటర్ సప్లై మరియు శ్రీ సత్య సాయి, వాటర్ సప్లై వర్కర్స్ తో చర్చించి సమస్యలు పరిష్కరించే దిశగా చూస్తున్నామని అలాగే సత్యసాయి వాటర్ సప్లై స్కీమ్ సంబంధించి కలెక్టర్ గారి చొరవతో  30 కోట్లు నిధులు ప్రభుత్వం నుండి విడుదల చేయించడం జరిగిందని తెలిపారు. వర్కర్స్ నిధులు విడుదల చేయించినందులకు గాను హర్షం వ్యక్తం చేశారు. శ్రీరామ్ రెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి జిల్లా పరిషత్ నుంచి నిధులను వెంటనే కాంట్రాక్టర్లకు నిధులను మంజూరు చేయుటకు చర్యలు  తీసుకుంటున్నామన్నారు.తద్వారా వర్కర్స్ కు జీతభత్యాలు అదేవిధంగా చూస్తామని తెలిపారు. మిగిలిన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు మీకు న్యాయం జరిగే విధంగా చూస్తామని మీరు వెంటనే సమ్మెను విరుమంపజేసి విధులకు హాజరు కావాల్సిందిగా కోరారు. దీనికి శ్రీరామ్ రెడ్డి త్రాగునీటి పథకంలో మరియు శ్రీ సత్య సాయి, వాటర్ సప్లై వర్కర్స్ హర్షం వ్యక్తం చేసి సమ్మె విరమణ చేస్తున్నామని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో శ్రీరామ్ రెడ్డి ప్రాజెక్ట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసులు,ఆర్డబ్ల్యూఎస్  వర్కర్స్ యూనియన్ కురువ అధ్యక్షులు ఓబులు, జిల్లా అధ్యక్షులు ఎర్రి స్వామి, తిప్పేస్వామి  వర్కర్లు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">