- : రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్
అనంతపురం, సెప్టెంబర్ 19 :ప్రజాతేజమ్
- తమ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
- అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో గురువారం సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం & వైద్య విద్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ లు ప్రెస్ మీట్ నిర్వహించారు.
- ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడి ఈనెల 20వ తేదీ శుక్రవారం రోజుకి 100 రోజులు పూర్తవుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజునే పలు పథకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకాలు పెట్టడం జరిగిందని, పెన్షన్ ని 7 వేల రూపాయలు ఒకటో తేదీనే ఇచ్చేలా చర్యలు తీసుకోవడం జరిగిందని, నెల నెలా ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తున్నామన్నారు. మెగా డీఎస్సీ కింద ఉద్యోగాల కల్పన, అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం, జిల్లాకు ఉపయోగపడేటువంటి డ్రిప్పు, స్ప్లింక్లర్ల పరికరాలను 90 శాతం సబ్సిడీతో పునరుద్ధరణ చేయడం జరిగిందని, వీటితోపాటు ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమగ్ర ప్రాధాన్యతలను నిర్ణయించేందుకు రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. దీంతో పాటు రైతంగాన్ని, మహిళలను ఆదుకోవడానికి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ఎన్డిఏ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. అనంతపురం జిల్లా అవసరాలు తీర్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, శాసనసభ్యులు అందరూ జిల్లా ప్రజల కోసం కూలీలుగా పని చేస్తామనే నమ్మకాన్ని జిల్లా రైతులకు ఇస్తున్నామన్నారు. వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో పాటు చేయాల్సిన లక్ష్యాలను కూడా నిర్దేశించుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఒక ఏడాదిలో ఏం చేయాలి, రెండు సంవత్సరాలలో ఏం చేయాలి, శాఖల వారీగా ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు రోడ్లు, లా అండ్ ఆర్డర్, లాంటి అన్నిట్లోనూ కూడా లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నామన్నారు. ప్రజల కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందన్నారు. దేశంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం ఆశీస్సులతో గాడితప్పిన, కుంటుపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఎప్పుడు ఏ సమస్యతో వెళ్లినా లేదు అనకుండా ఏదో ఒక పరిష్కారం చూపిస్తున్న వారికి, ముఖ్యమంత్రికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, కూటమి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ వరదలు అతలాకుతలం చేసినా మళ్లీ నిలదొక్కుకునేలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రజల కోసం కమిట్మెంట్ తో పని చేస్తామన్నారు.
- ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ఆర్థిక భారం ఎంతో ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం సామాజిక పెన్షన్లను పెంచడం, ఒకటవ తేదీన ఇంటి వద్దకే వెళ్లి అందించడం, అన్నా కాంటీన్ల ఏర్పాటు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మొదటి వంద రోజుల్లోనే కోట్లాది ఆర్థిక సంఘం నిధులు ఇవ్వడం, ఉపాధి హామీ కింద లక్షల కోట్ల పని దినాలు ఇవ్వడం, లాంటి అనేక సంక్షేమ పథకాలను చేపడుతున్నామన్నారు. ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కోసం వేల కోట్ల రూపాయల నిధులను, రాజధాని అమరావతి నిర్మాణానికి వేల కోట్ల నిధులు తీసుకురావడం, రాయలసీమ ప్రాంత ఆర్థిక అభివృద్ధి మాత్రమే కాకుండా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించే ప్రయత్నం చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా కోట్లాది రూపాయలతో 17వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణం చేపట్టడం జరుగుతోందన్నారు. ఒకవైపు సంక్షేమం, అభివృద్ధి, మరోవైపు భవిష్యత్తు ప్రణాళిక రూపకల్పనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన కొరత తీర్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఎక్కువ మంది గుండెజెబ్బుల బారిన పడుతున్న నేపథ్యంలో స్టెమి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని, క్యాన్సర్ కి స్క్రీనింగ్ చేసే కార్యక్రమాన్ని తీసుకువచ్చామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
- ఈ కార్యక్రమంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.